Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్: చిరు పాత్రకు వరుణ్ నో చెప్పాడా?
By: Tupaki Desk | 17 Aug 2018 2:21 PM GMTనందమూరి బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' పై ఇప్పటికే ప్రేక్షకుల్లో - ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాలో నటిస్తున్న నటుల లిస్టు ఇప్పటికే చాలా పెద్దదిగా ఉంది. దీనికి తోడు కొత్తగా వచ్చే అప్డేట్ లు ఆసక్తిని మరింతగా పెంచుతున్నాయి. కానీ ఇది మాత్రం కాస్త నిరాశపరిచే వార్తే.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర పోషించేందుకు డైరెక్టర్ క్రిష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను సంప్రదించాడట. క్రిష్ - వరుణ్ కాంబినేషన్ లో గతంలో 'కంచె' సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. మొదట్లో వరుణ్ తన పెదనాన్న పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపించాడట గానీ ఫైనల్ గా మాత్రం తిరస్కరించాడని సమాచారం. మరి ఇలా ఎందుకు జరిగిందనేందుకు.. ఫిలిం నగర్లో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కొంతమందేమో మెగా ఫ్యాన్స్ వద్ద నుండి చిరు పాత్ర చేయవద్దని ప్రెజర్ వచ్చిందట. అందుకే క్రిష్ ఆఫర్ కు 'నో' చెప్పాడని అంటున్నారు. కానీ మరి కొందరేమో అలాంటిదేమీ లేదని పెదనాన్న పాత్రలో తను పెద్దగా సూట్ కాననే ఉద్దేశంతో 'నో' చెప్పాడని అంటున్నారు.. అంతే కాదు వరుణ్ కంటే సాయి ధరమ్ తేజ్ కు చిరంజీవి పోలికలు ఎక్కువగా ఉంటాయి కదా అనే లాజిక్ కూడా చెప్తున్నారు... మరి అదే నిజమేమో!
నందమూరి - మెగా ఫ్యాన్స్ మధ్యలో పోటీ ఉండేదన్న విషయం అందరికీ తెలిసిందే గానీ.. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-చరణ్ మల్టి స్టారర్ రానుంది. ఒక వేళ మెగా ఫ్యాన్స్ కు వరుణ్ నందమూరి స్టార్ హీరో సినిమాలో నటించడం ఇబ్బంది అయితే.. మరి #RRR కు వాళ్ళు అభ్యంతరం చెప్తారా? రామ్ చరణ్ వెనకడుగు వేస్తాడా? ఏంటో ఈ ఫ్యాన్స్!