Begin typing your search above and press return to search.
మెగా హీరో రివర్స్ సెంటిమెంట్
By: Tupaki Desk | 17 Jan 2019 1:30 AM GMTసాధారణంగా ఏ బాషా పరిశ్రమ అయినా సినిమాల విడుదలకు అనుకూలమైన రోజు శుక్రవారమన్న సంగతి తెలిసిందే. అయితే అంతకంతకూ పెరుగుతూ పోతున్న పోటీ వల్ల ఇది మార్చుకునే పరిస్థితి వచ్చేసింది. సెలవులను టార్గెట్ చేస్తూ ఓపెనింగ్స్ మీదే దృష్టి పెట్టడంతో అది ఏ రోజు అనే పట్టింపులను క్రమంగా పక్కన పెట్టేస్తున్నారు. బుధవారం కూడా ఈ మధ్య కాలంలో ట్రెండ్ గా మారింది. గత ఏడాది బ్లాక్ బస్టర్స్ మహానటి-గీత గోవిందంలు రెండూ వెడ్నెస్ డే వచ్చినవే. ఇక గురువారం అధిక శాతం అచ్చిరాకపోయినా ఆరెక్స్ 100 లాంటి సినిమాలు ఆ ట్రెండ్ ని బ్రేక్ చేసాయి.
ఇప్పుడు శనివారం వంతు వచ్చింది. వీక్ ఎండ్ లో కేవలం రెండు రోజులు మాత్రమే వస్తాయి కాబట్టి ఆ రోజుని మాములుగా దర్శక నిర్మాతలు ఇష్టపడరు. అందులోనూ శనివారం అంటే సౌండింగ్ పరంగా మరోరకంగా నెగటివ్ గా ఫీలయ్యే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కాని మెగా హీరో వరుణ్ తేజ్ కు మాత్రం ఇదే కలిసి వస్తోంది.
గత ఏడాది సాయి ధరం తేజ్ ఇంటెలిజెంట్ తో క్లాష్ అయినప్పుడు వరుణ్ తేజ్ తొలిప్రేమను ఒకరోజు ఆలస్యంగా ఫిబ్రవరి 10న విడుదల చేసారు. ఆ రోజు శనివారం. ముందుది డిజాస్టర్ కాగా తొలిప్రేమ స్వీట్ హిట్ గా నిలిచింది.
ఇప్పుడు ఎఫ్2 సంక్రాంతి రేస్ లో ఉన్న పోటీ వల్ల చివర్లో జనవరి 12న వచ్చింది. టాక్ సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ దాకా వెళ్తోంది. ఇది సాటర్ డే. అంటే రెండు శనివారాలు వరుణ్ తేజ్ కు హిట్లు ఇచ్చాయన్న మాట. ఎఫ్2లో వెంకటేష్ దే డామినేషన్ అయినప్పటికీ స్క్రీన్ షేర్ చేసుకుని దాన్ని మల్టీ స్టారర్ గా మార్చాడు కాబట్టి వరుణ్ తేజ్ కు హిట్ లో వాటా దక్కుతుంది. సో ఇకపై ఈ లెక్కన శనివారం కూడా మంచి ఛాయస్ గా మిగిలేలా ఉంది.