Begin typing your search above and press return to search.

ఐమ్యాక్స్ లో మెగా హీరో డేటింగ్

By:  Tupaki Desk   |   12 Feb 2018 4:33 AM GMT
ఐమ్యాక్స్ లో మెగా హీరో డేటింగ్
X
మెగా హీరో వరుణ్ తేజ్ ఫైనల్ గా మరో హిట్టు కొట్టేశాడు. బాబాయ్ హిట్టు టైటిల్ ని తన సినిమాకు సెట్ చేసుకొని మొదట అంచనాలను పెంచుకున్న వరుణ్ తేజ్ విడుదల తరువాత అందరిని ఈక్వల్ గా సంతృప్తి చేశాడు. ఓ విధంగా చెప్పాలంటే అందరికి తొలి ప్రేమను గుర్తు చేశాడు. మనిషి జీవితంలో మొదటి క్రష్ ఉండడం చాలా సహజం. ఆ జ్ఞాపకాలను ఎవ్వరు మరచిపోలేరు. సినిమా ఆ మెమోరీస్ ని మైండ్ లో రిలోడ్ చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే తొలి ప్రేమ అనేది ఆ సినిమాలో నటించిన వారికి కూడా మంచి జ్ఞాపకమే. వారు కూడా బాగానే గుర్తు చేసుకున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ రాశి ఖన్నా అండ్ కథానాయకుడు వరుణ్ తేజ్ వారి ఫస్ట్ క్రష్ గురించి క్లియర్ గా చెప్పేశారు. మొదట చాలా ఉన్నాయ్ అలాంటివి అంటూ కొంచెం సిగ్గు పడ్డ మెగా హీరో అనంతరం అసలు మ్యాటర్ చెప్పేశాడు. అప్పట్లో ఐమాక్స్ లో ఒక అమ్మాయితో సినిమాకి వెళ్లాను. థియేటర్ లో కూర్చున్నాం సైలెంట్ గా. పెద్దగా ఏమి మాట్లాడుకోలేదు అని ఆ అమ్మాయి కి పాప్ కార్న్ కూల్ డ్రింక్ కొనిచ్చినట్లు చెప్పాడు. ఆ తరువాత తను వెళ్ళిపోయిందని రీసెంట్ గా ఐమాక్స్ కి వెళ్ళినప్పుడు గుర్తుకుతెచ్చుకున్నాను అంటూ ఆ డేటింగ్ గురించి వరుణ్ వివరించాడు.

రాశి కూడా తన తొలి ప్రేమ గురించి చెప్పేసింది. స్కూల్ దశలో ఉన్నపుడు ఒక సీనియర్ తో ఉండేది. అప్పుడు నా వయసు 17 అని సింపుల్ గా చెప్పేసింది. అయితే వరుణ్ ఆమె చెప్పిన మ్యాటర్ కి కౌంటర్ వేశాడు. అప్పుడే లవ్ లు నడిపించవా అని. నువ్వు కూడా చేశావు కదా అంటూ బబ్లీ గర్ల్ రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇలా తొలి ప్రేమ జంట వారి తోలి ప్రేమ లను హ్యాపీగా చెప్పుకున్నారు.