Begin typing your search above and press return to search.
సాఫ్ట్‌గా చేస్తానంటే కుదరదు ముకుందా
By: Tupaki Desk | 11 April 2015 5:05 AM GMTమెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ 'ముకుంద' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. తొలిసినిమాతోనే నటుడిగా మంచి మార్కులే వేయించుకున్నాడు. ఆరడుగుల ఆజానుబాహుడు.. అందగాడు.. గ్రీకువీరుడిలా ఉన్నాడని ప్రశంసించారంతా. మెగా హీరో కాబట్టి మార్కెట్ పరంగానూ తొలిసినిమాతో ఇబ్బంది కాలేదు. కాని శ్రీకాంత్ అడ్డాల హీరోని మరీ సాఫ్ట్‌గా చూపించాడే అని కొందరు విమర్శించారు.
ఇక వరుణ్‌తేజ్ స్వభావానికి ఎలాంటి స్క్రిప్టు అవసరమో.. అలాంటి స్క్రిప్టునే శ్రీకాంత్ హ్యాండిల్ చేశాడు. తనవంతుగా ఓ ఆరంగేట్ర హీరోని ఎలా చూపించాలో అలా చూపించాడు. కావాల్సినంత ఎలివేట్ చేశాడు. వైవియస్ చౌదరిలా అనవసర హంగామాకి, అనవసర ఖర్చుకి వెళ్లిపోలేదు. ఓ కొత్త కుర్రాడి మార్కెట్ పరిధిని దృష్టిలో పెట్టుకునే ముకుంద చిత్రాన్ని తెరకెక్కించి ఫర్వాలేదనిపించాడు. అయితే ఇప్పుడు వరుణ్‌తేజ్ రెండో సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కంచె అనేది టైటిల్. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతోంది? వరుణ్‌ని క్రిష్ ఎలా చూపించబోతున్నాడు? అన్న ప్రశ్న ఎదురవుతోంది.
ముకుందలో చూపించినట్టు హీరోని మరీ అంత సాఫ్ట్‌గా చూపించాలనుకుంటే క్రిష్ ప్రమాదంలో పడినట్టే. వరుణ్‌తేజ్‌కి ఇప్పుడు కావాల్సింది మాస్ ఆదరణ. కాబట్టి సినిమాని పూర్తి స్థాయిలో కమర్షియల్‌గా వండి వార్చాలి. అలా కాని పక్షంలో వరుణ్‌తేజ్ నుంచి మాస్ జనాలు ఏం ఆశిస్తున్నారో అది కనిపించనట్టవుతుంది. మరీ సాఫ్ట్‌గా చూపిస్తే ప్రమాదం తప్పనిసరి. స్వభావ రీత్యా క్రిష్ మరీ ఎక్కువగా కమర్షియల్ అంశాల జోలికి వెళ్లకుండా కథని నమ్మి వెళతాడు కాబట్టి కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.
క్రిష్ ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం. వరుణ్‌తేజ్ మూడో సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే.