Begin typing your search above and press return to search.

ఇద్దరు భామలతో మెగా హీరో రొమాన్స్

By:  Tupaki Desk   |   3 Feb 2016 7:30 AM GMT
ఇద్దరు భామలతో మెగా హీరో రొమాన్స్
X
వరుణ్ తేజ్ మరికొన్ని వారాల్లో తన నెక్ట్స్ మూవీని మొదలుపెట్టబోతున్నాడు. తనకు కంచె లాంటి విభిన్నమైన సినిమాని ఇచ్చిన డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలోనే.. మరో సినిమా చేస్తున్నాడు. రాయబారి అనే టైటిల్ ని ఈ మూవీకి అనుకుంటుండగా.. స్పై థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీ కోసం ఇప్పటికే కంచె హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ని ఫైనలైజ్ చేశారు.

రాయబారిలో మరో హీరోయిన్ కి స్కోప్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండో భామ కోసం హీరోయిన్ ని వెతుకుతున్నాడు క్రిష్. ఇప్పటికే చాలామందిని అనుకుంటున్నారని సెట్స్ పైకి వెళ్లేనాటికి రెండో హీరోయిన్ ని కూడా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. తొలిసారిగా ఈ మెగా హీరో ఇద్దరు భామలతో రొమాన్స్ చేయడం మాత్రం ఖాయమైంది. ఇప్పటివరకూ ఈ కుర్రాడు మూడు సినిమాలు చేసినా, అన్నింటిలోనూ ఒకే అమ్మాయికి ఫిక్స్ అయ్యి గుడ్ బాయ్ లానే ఉన్నాడు. ఇప్పుడు రాయబారి అంటే.. జేమ్స్ బాండ్ తరహా సినిమా అన్నమాట.

అండర్ కవర్ ఏజంట్ రోల్ అంటే.. ఆమాత్రం సరసాలు తప్పనిసరిగా ఉంటాయి. కాకపోతే ఇది క్రిష్ సినిమా కాబట్టి మరీ ఎక్కువగా ఊహించుకోలేం కానీ.. రొమాన్స్ ని కూడా అందంగా చూపించగలడు ఈ డైరెక్టర్. ఇప్పటికే పెర్ఫామెన్స్ లో ప్రూవ్ చేసుకున్న వరుణ్ తేజ్... రాయబారిలో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో కీలక సన్నివేశాలని కూడా కంచే తీసిన ప్రాంతమైన రష్యాలోని జార్జియాలోనే తీయనున్నారు.