Begin typing your search above and press return to search.
వరుణ్ తేజ్ పంచ్ ఎవరి మీద??
By: Tupaki Desk | 17 April 2018 5:57 AM GMTమెగా ఫ్యామిలీ లో విభేదాలు ఉన్నాయంటూ అప్పుడప్పుడు చాలా కామెంట్స్ వినిపిస్తుంటాయ్. కానీ ఏ ఫ్యామిలీ లో అయినా చిన్న చిన్న సమస్యలు ఉండడం సాధారణం. కొన్ని పరిస్థితుల్లో వారు ఒకటయితే ఆ రూమర్స్ అబద్ధమని తెలుస్తుంది. ఒకే బ్లడ్ లో ఉండే మ్యాజిక్ వేరేలా ఉంటుంది. అది ఏ కుటుంబంలో అయినా సరే. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో కిలకంగా అడుగులు వేస్తోన్న పవన్ కళ్యాణ్ పై గత కొంత కాలంగా స్పెషల్ టార్గెట్స్ అమలవుతున్నాయి.
కానీ పవన్ ఆ విషయాల గురించి కొంచెం కూడా లెక్క చేయలేదు. బలవంతుడే భరిస్తాడు అనే తరహాలో కొన్ని సార్లు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. కానీ మెగా ఫ్యాన్స్ పవన్ పై వస్తోన్న ఆరోపణలకు అస్సలు ఓపిగ్గా ఉండలేకపోతున్నారు. ఎంత సైలెంట్ గా ఉన్నప్పటికీ పుండు మీద కారం చల్లినట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఎప్పుడు ఎలాంటి కాంట్రావర్సీకి తావివ్వని వరుణ్ రీసెంట్ గా ఒక మెస్సేజ్ తో కౌంటర్ ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చేసినట్లు అర్ధమవుతోంది. హిప్పోక్రైట్స్ లేదా జడ్జిమెంటల్ అనే ఆలోచనతో బాధపడుతున్నవారు మిమ్మల్ని శిక్షించటానికి వీలుకాదు. వారు వారి సొంత బలహీనతలను ప్రదర్శిస్తున్నారు. ఇతరులను బాదించడం వారికి చాలా సులభం. వారి సొంత ప్రబుద్దిని అద్దంలో చూపిస్తున్నారు అని వరుణ్ ట్వీట్ చేశాడు. దీంతో ఈ పంచ్ ఎవరి మీద పడింది అనే తరహాలో నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అసలు ఇలాంటి మెసేజులు చూస్తుంటే.. నిజంగా మెగా హీరోలకు ఓపిక చాలా ఎక్కువే.. అనుకోవాలి. అవతల పవన్ కళ్యాణ్ నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ వరకు.. సైలెంట్ గా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.