Begin typing your search above and press return to search.

`మిస్ట‌ర్`కోసం మెగా హీరో షాపింగ్‌

By:  Tupaki Desk   |   18 Jun 2016 7:40 AM GMT
`మిస్ట‌ర్`కోసం మెగా హీరో షాపింగ్‌
X
లుక్స్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకొంటున్నాడు మెగా హీరో వ‌రుణ్ తేజ్‌. మెగా ప్రిన్స్ అన్న బిరుదు మహ‌త్య‌మో మ‌రేంటో తెలియ‌దు కానీ... తెర‌పైన కొత్త‌గా - మ‌రింత అందంగా క‌నిపించాల‌ని త‌పిస్తున్నాడు. కొత్త సినిమా మిస్ట‌ర్ కోసం ఇటీవ‌ల పెద్దయెత్తున షాపింగ్ చేస్తున్నాడు. అది కూడా దుబాయ్‌ లో. కాస్ట్యూమ్ డిజైన‌ర్‌ ని వెంట‌బెట్టుకొని వెళ్లి అల‌సిపోయేలా బ‌ట్ట‌ల షాపింగ్ చేశాడు. మిస్ట‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే స్పెయిన్‌ లో మొద‌లు కాబోతోంది. శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఆ చిత్రంలో వ‌రుణ్‌ తేజ్ ఓ స్టూడెంట్‌ గా క‌నిపిస్తాడ‌ట‌. మంచి తెలివిప‌రుడైన స్టూడెంట్ పాత్ర అది.

విదేశాల నేప‌థ్యంలో జ‌రిగే క‌థ కాబ‌ట్టి అప్పీరెన్స్ కూడా అందుకు త‌గ్గ‌ట్టుగా ఉండాల‌ని తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు వ‌రుణ్‌ తేజ్‌. ఇప్ప‌టికే నాలుగైదు గెటప్స్ ప్ర‌య‌త్నించి చివ‌రిగా ఓ గెట‌ప్‌ ని ప‌క్కా చేసి పెట్టుకొన్నాడు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఇప్పుడు షాపింగ్ చేశాడు. ఇప్ప‌టిదాకా వ‌రుణ్‌ తేజ్ చేసిన చిత్రాల్లో లుక్స్ పెద్ద‌గా మారింది లేదు. అందుకే ఈసారి లుక్కుని కంప్లీట్‌ గా మార్చేసి ఆడియన్స్‌ కి కొత్త వ‌రుణ్‌ తేజ్‌ ని చూపించాల‌ని డిసైడ్ అయ్యాడు. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల స‌ల‌హాలు కూడా ఉన్నాయ‌ట‌. ఆయ‌నకి కూడా హిట్టు చాలా ఇంపార్టెంటు. అందుకే హీరో హీరోయిన్ల గెట‌ప్పులు మొద‌లుకొని ప్ర‌తి విష‌యంలోనూ ప్ర‌త్యేక‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకొంటున్నాడు.