Begin typing your search above and press return to search.

నిజామ్ కాలం నేపథ్యంలో మెగా ప్రేమ కథ!

By:  Tupaki Desk   |   29 Oct 2018 5:00 AM GMT
నిజామ్ కాలం నేపథ్యంలో మెగా ప్రేమ కథ!
X
టాలీవుడ్ లో ఇప్పుడు రెండు మూడు ట్రెండ్స్ ఉన్నాయి. ఒకటి - బోల్డ్ కంటెంట్ ఫిలిమ్స్.. రెండు- బయోపిక్స్.. మూడు- పీరియడ్ ఫిలిమ్స్. ఇక రంగస్థలం సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత పాత కాలం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాల జోరు పెరిగింది. కానీ రంగస్థలం కంటే ముందే 'అప్పట్లో ఒకడుండేవాడు' రిలీజ్ అయింది. 'కంచె' కూడా పీరియడ్ సినిమానే. ఇక రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ తాజా చిత్రం కూడా పీరియడ్ సినిమానే. ఇది 'రంగస్థలం' కంటే ముందుగానే ప్లానింగ్ దశలో ఉన్నది.

తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ ఒక పీరియడ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సాగర్ చంద్ర నిజామ్ నవాబుల కాలం నేపథ్యంలో సాగే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తో వరుణ్ తేజ్ ను మెప్పించాడట. అంతే కాదు ఇది మనసుకు హత్తుకొనే ఒక ప్రేమ కథ అని సమాచారం. సాగర్ చంద్ర తన మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 90'ల కాలాన్ని సినిమాలో చూపించిన విధానానికి ప్రేక్షకులు కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా నిజాం కాలాన్ని ఎంచుకోవడం విశేషమే.

'ఫిదా' తర్వాత తెలంగాణా నేపథ్యంలో వరుణ్ తేజ్ కు ఇది రెండో సినిమా అవుతుంది. నిజానికి 'ఫిదా' తోనే వరుణ్ తేజ్ కు ఫస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చింది. మరి ఈసారి నిజామ్ నవాబుల కాలానికి వెళ్ళి మరీ లవ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. దీంతో డిఫరెంట్ కాన్సెప్ట్ లు ఎంచుకుంటాడనే పేరును వరుణ్ తేజ్ మరోసారి నిలబెట్టుకున్నట్టే. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రానుందట.