Begin typing your search above and press return to search.

గదిలో తలుపు వేసుకుని ఏడ్చా -వరుణ్‌ తేజ్

By:  Tupaki Desk   |   22 Aug 2016 4:18 PM GMT
గదిలో తలుపు వేసుకుని ఏడ్చా -వరుణ్‌ తేజ్
X
చిరంజీవి 61వ పుట్టినరోజు సందర్భంగా.. సోమవారం సాయంత్రం శిల్పాకళావేదికలో వేడుకలు జరిపాడు హీరో రామ్‌ చరణ్‌. ఈ సందర్భంగా ఆయన 150వ సినిమా మోషన్ పోస్టర్ కూడా అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఈ వేడుకకు చిరంజీవి అండ్ పవన్‌ కళ్యాణ్‌ తప్పించి మెగా హీరోలందరూ విచ్చేశారులే. అశేష మెగాభిమానుల సాక్షిగా ఛార్మింగ్ గయ్ వరుణ్‌ తేజ్ చేసిన వ్యాఖ్యలు మామూలుగా లేవు మరి.

''పెదనాన్న పాలిటిక్స్ లోకి వెళ్తున్నారు.. సినిమాలు మానేస్తున్నారు.. అని చెప్పినప్పుడు బాధ వేసింది. ఒక గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని ఏడ్చేశా. తరువాత చాలాసార్లు ఆయన్ను డాడీ సినిమలు ఎప్పుడు చేస్తారు?.. వెయిట్ చేస్తున్నాం.. చాలామంది అడుగున్నతారు.. అని అడిగాను. ఆయన చూద్దాం చేద్దాం అన్నారు. ఇక 9 సంవత్సరాల తరువాత ఆయన అందరి మాటా విన్నారు.. బాస్ ఈజ్ బ్యాక్'' అంటూ ఉద్వేగంగా చెప్పాడు వరుణ్‌ తేజ్. మనోడి స్పీచ్ తో ఒక్కసారిగా ఆడిటోరియం మార్మోగిపోయింది.

ఇకపోతే చాలామంది మల్ళీ డ్యాన్సులు అలా చేయగలుగుతారా, ఫైట్లు చేస్తారా అని అడుగుతున్నారని.. వారందరికీ నా సమాధానం ఒక్కటే.. ''కాశీకి పోయాడు.. కాషాయం మనిషైపోయాడు అనుకున్నారా?.. వారణాసిలో బతుకుతున్నాడు తన వరుస మార్చుంటాడు అనకున్నారా? అదే రక్తం.. అదే పౌరుషం'' అంటూ ఇంద్ర సినిమాలోని డైలాగు చెప్పాడు వరుణ్‌ తేజ్‌.