Begin typing your search above and press return to search.

వరుణ్, వైట్ల.. వాట్ ఏ కాంబినేషన్

By:  Tupaki Desk   |   22 Feb 2016 5:30 AM GMT
వరుణ్, వైట్ల.. వాట్ ఏ కాంబినేషన్
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో సినిమా తీసేందుకు చాలామంది దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నా.. చాలా సెలెక్టివ్ గా సినిమాలకు సైన్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. అనుకోని కారణాలతో క్రిష్ తో చేయాల్సిన 'రాయబారి' ఆగిపోవడంతో.. తర్వాతి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు కూడా. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించనున్న 'ఫీల్ మై లవ్' మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సమయంలో ఓ స్టార్ డైరెక్టర్ కి కూడా వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

వరుస రెండు డిజాస్టర్లతో దెబ్బతిన్న శ్రీనువైట్ల.. ఇప్పుడు మంచి కసితో ఉన్నాడు. హిట్ కొట్టి తన స్టామినా ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్న వైట్ల.. వరుణ్ తేజ్ కి ఓ స్టోరీ వినిపించాడని తెలుస్తోంది. ఈ డైరెక్టర్ చెప్పిన లైన్ కూడా లవ్ స్టోరీయే అని సమాచారం. వైట్ల చెప్పిన తీరు, లవ్ స్టోరీ థీమ్ చాలా బాగుండడడంతో.. వెంటనే వైట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట వరుణ్ తేజ్.

షూటింగ్ విషయంలో కూడా ఏ మాత్రం ఆలస్యం చేయాలని అనుకోవడం లేదు ఈ మెగా హీరో. 'ఫీల్ మై లవ్' షూటింగ్ ప్రారంభం కాగానే.. శ్రీను వైట్ల సినిమా కూడా మొదలు పెట్టేసేలా ప్లాన్ చేశారని అంటున్నారు. ఒకేసారి రెండు సినిమాలను షూటింగ్ చేసేసి, రెండు నెలల గ్యాప్ లో విడుదల చేయాలని భావిస్తున్నారట. త్వరలో ఈ ప్రాజెక్టుపై శ్రీనువైట్ల - వరుణ్ తేజ్ లు అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.