Begin typing your search above and press return to search.
కమ్ములతో కంచె తెంచుతున్న వరుణ్
By: Tupaki Desk | 20 May 2016 1:33 PM GMTమెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.. డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకూ ఈ హీరో చేసిన మూడు సినిమాలు రిలీజ్ అయితే.. ఒకదానికి మరో మూవీకి సంబంధం లేని జోనర్ లు -కేరక్టర్లు - స్టోరీలు. ముకుంద - కంచె - లోఫర్ ల తర్వాత.. వరుణ్ తేజ్ పై మెగా ఫ్యాన్స్ లోను - ఆడియన్స్ లోను అంచనాలు బాగానే పెరిగాయి. ప్రస్తుతం శ్రీనువైట్లతో మిస్టర్ చేసేందుకు రెడీ అయిన వరుణ్ తేజ్.. మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది.
మెగా ఫ్యామిలీ హీరోతో సినిమా చేసేందుకు ట్యాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చాలాకాలంగానే ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ తో తన ఓ డిఫరెంట్ మూవీని అందించనున్నాడీ దర్శకుడు. అమెరికా-తెలంగాణలను లింక్ చేస్తూ కమ్ముల చెప్పిన స్టోరీ సూపర్బ్ గా ఉందని.. వరుణ్ తేజ్ తో ఈ సినిమాను తీయబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు అనౌన్స్ చేశాడు. 'అమెరికాలో ఉండే ఓ అబ్బాయి... తెలంగాణలో పుట్టి పెరిగిన ఓ అమ్మాయికి మధ్య ప్రేమ.. ఎలా మొదలైంది, ఎలా కలుసుకున్నారు, ఏం జరిగింది.. ఇదే సినిమా. దీన్ని కమ్ముల అద్భుతంగా చూపించబోతున్నాడు' అంటూ చెప్పాడు నిర్మాత దిల్ రాజు.
హీరోయిన్ తో పాటు మిగిలిన టెక్నీషియన్స్ ను త్వరలో అనౌన్స్ చేస్తామని నిర్మాత చెప్పాడు. వరుణ్ తేజ్ మరో క్రియేటివ్ డైరెక్టర్ చేతిలో పడ్డం మాత్రం.. ఆశ్చర్యకరమైన విషయమే. ప్రొడ్యూసర్ చెప్పిన డీటైల్స్ ప్రకారం చూస్తే.. అమెరికా- తెలంగాణల మధ్య ప్రేమ కంచెలు ఏమన్నా ఉంటే కమ్ములతో కలిసి వరుణ్ తేజ్ తెంచేస్తాడని అర్ధమవుతోంది కదూ.