Begin typing your search above and press return to search.

ఒక రోజు ముందే ప్రేమ కురుస్తుందా?

By:  Tupaki Desk   |   5 Feb 2018 6:23 AM GMT
ఒక రోజు ముందే ప్రేమ కురుస్తుందా?
X
టాలీవుడ్ లో ఎన్నడూ కనిపించని ఓ కొత్త పోటీ ఇప్పుడు ఏర్పడింది. ఇద్దరు మెగా హీరోలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చేస్తున్నారు. ముందుగా చెప్పిన ప్రకారం అయితే.. ఈ శుక్రవారం నాడు సాయిధరం తేజ్ ఇంటెలిజెంట్.. వరుణ్ తేజ్ తొలిప్రేమ రిలీజ్ కావాల్సిందే. కానీ దిల్ రాజు హ్యాండ్ పడ్డంతో తొలిప్రేమను ఓ రోజు వెనక్కు జరిపారు. అంటే ఫిబ్రవరి 10న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇలా ఒక రోజు పోస్ట్ పోన్ మెంట్ కు అంతా సిద్ధమైంది. కానీ ఓవర్సీస్ లో అలా కుదరదు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే.. అంటే గురువారం సాయంత్రం నుంచే అక్కడ ప్రీమియర్లు పడబోతున్నాయి. శుక్రవారం సినిమా కూడా వచ్చేస్తుంది. కానీ తెలుగు స్టేట్స్ లోనే ఒక రోజు ఆలస్యంగా వస్తుందన్న మాట. అయితే.. ఇది అంత ఆరోగ్యకరమైన పరిణామం కాదని.. తమ సినిమాకు చేటు చేసే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే తొలిప్రేమను ఇక్కడ 9నే రంగంలోకి దించేయాలని భావిస్తున్నారట.

అయితే.. ఇంటెలిజెంట్ తో ఇప్పటికే ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. మాణింగ్ షోస్ నుంచి కాకుండా.. 9 సాయంత్రం నుంచి తొలిప్రేమ షోస్ పడేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికైతే ఇది అధికారికం కాదు కానీ.. ఇప్పటికే నిర్మాతలు ఈ మేరకు డెసిషన్ తీసుకున్నారట. ఇవాళ రేపట్లో ఈమేరకు అనౌన్స్ మెంట్ వచ్చేయవచ్చని తెలుస్తోంది.