Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్‌: తొలిప్రేమ అదిరిందిగా

By:  Tupaki Desk   |   4 Dec 2017 10:18 AM GMT
ఫస్ట్ లుక్‌: తొలిప్రేమ అదిరిందిగా
X
ఫిదా సినిమాతో కెరీర్ లో మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ తనకంటూ ఒక మంచి మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. ఫిదా ఇచ్చిన సక్సెస్ తో కెరీర్ ను చక్కబెట్టుకోవాలని వరుణ్ చాలా జాగ్రత్తగా కథలను ఎంచుకుంటున్నాడు. ఏ మాత్రం తొందరపడకుండా తనకు సెట్ అయ్యే కథలని మాత్రమే ఒకే చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత వరుణ్ కి చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ చాలా కథలు రొటీన్ గా ఉండడంతో ఒకే చేయలేదు. మరికొన్నిటిని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడు.

ఇకపోతే ప్రస్తుతం వరుణ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటికే తొలిప్రేమ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈరోజు సడన్ గా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిన తొలి ప్రేమ సినిమా ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే టైటిల్ ఇప్పుడు తీసుకుని.. సేమ పవర్ మెయిన్టయిన్ చేస్తున్నట్లున్నారు. ఇకపోతే ఒక స్టేషెన్ బెంచీపై కూర్చుని.. క్లీన్ షేవ్ తో రిలాక్స్ డ్ గా ఉన్న వరుణ్‌ తేజ్ ను చూస్తుంటే.. వావ్ అనాల్సిందే. కలర్ఫుల్ గా పోస్టర్ బాగుంది.

ఫారెన్ బ్యాక్ డ్రాప్ లో మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. వెంకీ అట్లూరి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తుండా.. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. బివిఎస్ఎన్.ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.