Begin typing your search above and press return to search.
పి.ఆర్.ఓ. గోల.. వరుణ్ తేజ్ క్లారిటీ
By: Tupaki Desk | 13 April 2016 9:30 AM GMTసడన్ గా పొద్దున్నే మెగా హీరో వరుణ్ తేజ్ ఒక ట్వీటేశాడు. ''ఇప్పటివరకు నాకు ఎవ్వరూ పర్సనల్ పి.ఆర్.ఓ. అనేవారే లేరు. థ్యాంక్యూ గయ్స్'' అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నాడు ఈ యంగ్ మెగా హీరో. ఇంతకీ అసలు ఈ ట్వీట్ వెనుక గోల ఏంటంటారు?
అబ్బే ఏం లేదు. ఈ మధ్యన చాలామంది ఫిలిం జర్నలిస్టులు పి.ఆర్.ఓ లుగా మారిపోతున్నారు. అలా మారిపోయిన ఒక వ్యక్తిని ఇప్పుడు వరుణ్ తేజ్ అండ్ సాయిధరమ్ తేజ్ లు పి.ఆర్.ఓ.గా పెట్టుకున్నారని ఒక న్యూస్ వచ్చింది. దీనితో మెగా ఫ్యాన్స్ అందరికీ బాగా మండిపోయింది. ఎందుకంటే సదరు పి.ఆర్.ఓ. ఓ నాలుగేళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవిపై దారుణమైన కామెంట్లే చేశాడు. ఆయన పొలిటికల్ జోకర్ అంటూ బహిరంగంగా సోషల్ సైట్లలో కాస్త హేయమైన పోస్టులే పెట్టాడు. అలాంటి హేట్రెడ్ ఉన్న వ్యక్తిని ఇప్పుడు నువ్వు పి.ఆర్.ఓ.గా ఎలా పెట్టుకుంటావ్ వరుణ్ అంటూ చాలామంది అభిమానులు ఆన్ లైన్ లో ఏకేయడం స్టార్ట్ చేశారు. అందుకే వరుణ్ వెంటనే రియాక్ట్ అయ్యాడు.
అయితే సదరు యవ్వారంపై ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉండే ఆ పి.ఆర్.ఓ. మాత్రం సైలెంటైపోయాడు. నేను పలానా వర్గం అభిమానిని అంటూ ఓపెన్ గా చెప్పేస్తే.. ఫిలిం ఇండస్ర్టీలో అందరితో కలసి వ్యాపారం చేసుకోవడం కష్టమైపోతుంది అని తెలుసుకోవడానికి ఈ ఇన్సిడెంట్ ఒక ఉదాహరణ.