Begin typing your search above and press return to search.
పెదనాన్న బాటలో వరుణ్ తేజ్
By: Tupaki Desk | 3 Jun 2018 10:24 AM GMTఫిదా తొలిప్రేమతో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ కొట్టేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ఉన్నాడు. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా స్పేస్ షిప్ నేపథ్యంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం అత్యుత్తమ హాలీవుడ్ టెకీషీయన్స్ ని పిలిపిస్తున్నారు. వరుణ్ తేజ్-అదితి రావు హైదరిని 3డి స్కాన్ చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. ఇప్పటికే జీరో గ్రావిటీని తలపించే సెట్ ని కోట్లాది రూపాయలతో రూపొందించిన యూనిట్ అందులో కీలకమైన సన్నివేశాల కోసం ఈ 3డి స్కాన్ చేస్తున్నారు . సిజి మిక్సింగ్ చేసేటప్పుడు ఇది చాలా కీలకంగా ఉంటుంది. సైరా నరసింహారెడ్డి కోసంచిరంజీవితో 3డి స్కాన్ ఇంతకు ముందే పూర్తి చేసాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇప్పుడు పెదనాన్న బాటలో నడుస్తూ వరుణ్ తేజ్ కూడా సంకల్ప్ రెడ్డి మూవీ కోసం రెడీ అవుతున్నాడు. దీనికి అంతరిక్షం-వ్యోమగామి అనే రెండు టైటిల్స్ వర్కింగ్ గా ప్రచారంలో ఉన్నాయి. ఏది ఓకే చేస్తారు అనే క్లారిటీ ఇంకా రాలేదు.
తెలుగు తెరపై ఈ జానర్ టచ్ చేయటం పూర్తి స్థాయిలో ఇంతవరకు జరగలేదు. ఆదిత్య 369లో లైట్ గా టచ్ చేసినప్పటికీ అది కేవలం ఒక పాటకు కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం. అప్పుడు టెక్నాలజీ పరంగా కూడా చాలా పరిమితులు ఉన్నాయి. కానీ వరుణ్ తేజ్ మూవీ అలా కాదు. కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ ని సిద్ధం చేస్తున్నారు. వరుణ్ తేజ్ ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్టు టాక్. డ్యూయల్ రోల్ కాకపోయినా ఒకదానికి ఒకటి సంబంధం లేని రెండు వేరియేషన్స్ పాత్రలో ఉంటాయట. లావణ్య త్రిపాఠి మరో హీరోయిన్ గా నాస్తిస్తున్న ఈ మూవీ నిర్మాతల్లో దర్శకుడు క్రిష్ కూడా ఉన్నాడు. ఘాజీ తరహాలోనే తక్కువ బడ్జెట్ లో రిచ్ క్వాలిటీతో రాజీ పడకుండా సంకల్ప్ ఇది తీస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీంతో మొదటిసారి హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్నాడు వరుణ్ తేజ్. మేకింగ్ చూస్తుంటే అదేమంత కష్టం కాదనిపిస్తోంది.