Begin typing your search above and press return to search.
'మిస్టర్' వరుణ్ తేజ్.. నిజమేనా?
By: Tupaki Desk | 23 March 2016 4:43 AM GMTనాగబాబు తనయుడిగా సినీ ఇండస్ట్రీలో ప్రవేశించిన వరుణ్ తేజ్.. ఇప్పటికి మూడు సినిమాలు చేశాడు. ఈ మూడు వేటికవే విభిన్నమైనవి. చివర లోఫర్ మూవీ కమర్షియల్ గా ఫ్లాప్ అయినా.. ముకుంద - క్రిష్ చిత్రాలతో మెగా హీరోలకు విభిన్నమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడీ కుర్రాడి నాలుగో సినిమాకి రంగం సిద్ధమవుతోంది.
శ్రీను వైట్ల కాంబినేషన్ లో వరుణ్ తేజ్ మూవీ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. త్వరలో షూటింగ్ కి కొబ్బరికాయ కొట్టేయనున్న ఈ చిత్రానికి.. ఇప్పుడో టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. సాధారణంగా శ్రీను వైట్ల సింగిల్ వర్డ్ తో టైటిల్ సెట్ చేస్తూ ఉంటాడు. ఢీ- రెడీ - కింగ్ - ఆగడు - దూకుడు - బాద్షా - బ్రూస్ లీ.. ఇలా క్యాచీగా ఉంటాయి వైట్ల టైటిల్స్. ఇప్పుడు వరుణ్ తేజ్ మూవీకి కూడా ఇలాంటి టైటిల్ నే అనుకుంటున్నారట. 'మిస్టర్' అనే టైటిల్ ని ఈ మూవీకి పరిశీలిస్తున్నారు. అయితే యూనిట్ నుంచి ఈ విషయం పై కన్ఫర్మేషన్ రాలేదు.
వైట్ల మూవీ కోసం వరుణ్ తేజ్ కొత్త గెటప్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఫుల్లుగా వెరైటీగా గడ్డం పెంచి కనిపిస్తున్నా.. మేకోవర్ ఇంకా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో వరుణ్ తేజ్ కి జంటగా కుమారి 21ఎఫ్ తో హిట్ కొట్టిన హేభా పటేల్ నటించనుంది.