Begin typing your search above and press return to search.
గ్యాంగ్ లీడర్ కి ఊహించని ముప్పు!
By: Tupaki Desk | 20 Sep 2019 12:56 PM GMT`నానీస్ గ్యాంగ్` లీడర్ ప్రస్తుత సన్నివేశమేంటి? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రెండో వారంలో ఎలా రాబడుతోంది? ప‌్రస్తుతం ట్రేడ్ అనలిస్టుల కబురేమిటి? అన్నది పరిశీలిస్తే ఆసక్తికర సంగతులే తెలిశాయి. సెప్టెంబర్ 13 న విడుదలైన గ్యాంగ్ లీడర్ తొలి వారం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.18.96 కోట్ల గ్రాస్ రాబట్టింది. 4వ రోజు నుంచి వసూళ్లలో ఊహించని డ్రాప్ కనిపించడం ఆశ్చర్యపరిచింది. నాలుగో రోజు తర్వాతి మూడు రోజుల్లో గ్యాంగ్ లీడర్ వసూళ్లు కేవలం 2.42 కోట్లు మాత్రమే. సరైన ప్రమోషన్ లేకపోవడం నాని అండ్ గ్యాంగ్ పట్టించుకోకపోవడం వగైరా కారణాలతో వసూళ్లలో సడెన్ డ్రాప్ పెద్ద రేంజులో కనిపించిందని విశ్లేషిస్తున్నారు.
ఏరియా వైజ్ గా తొలి వారం గ్రాస్ వివరాలు పరిశీలిస్తే.. నైజాం- 5.80 కోట్లు.. సీడెడ్- 1.81 కోట్లు.. కృష్ణా- 1.10 కోట్లు.. గుంటూరు -1.21 కోట్లు.. నెల్లూరు -0.47 కోట్లు.. వెస్ట్ గోదావరి- 0.85 కోట్లు.. ఈస్ట్ గోదావరి- 1.20 కోట్లు.. ఉత్తరాంధ్ర -1.90 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ఇండియా- 1.50 కోట్లు.. ఓవెర్సీస్ -3.12 కోట్లు.. మొత్తంగా చూస్తే 18.96 కోట్లు రాబట్టింది గ్యాంగ్ లీడర్.
ఓవైపు ఈ శుక్రవారం నుంచి రెండు సినిమాలు నానీస్ గ్యాంగ్ లీడర్ తో పోటీపడుతున్నాయి. వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ (వాల్మీకి).. సూర్య నటించిన బందోబస్త్ చిత్రాలు కలెక్షన్స్ షేర్ చేసుకుంటున్నాయి. వరుణ్ నటించిన వాల్మీకి చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఆ మేరకు జనాల దృష్టి ఆ థియేటర్ల వైపు మళ్లితే నానీస్ గ్యాంగ్ లీడర్ పరిస్థితేమిటి? అన్నది చూడాల్సి ఉంటుంది. గ్యాంగ్ లీడర్ ఇప్పటివరకూ సాధించింది స్వల్పమే. కనీసం లాంగ్ రన్ లో అయినా పంపిణీదారులు సేవ్ అవుతారా? అన్నది చెప్పలేని పరిస్థితి. దాదాపు 28 కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ సినిమా ఆ మేరకు షేర్ రాబట్టాల్సి ఉంటుంది. కానీ గ్రాస్ మ్యాటరే 19కోట్లకు పరిమితమైంది. దీనిని బట్టి బ్రేక్ ఈవెన్ కి షేర్ రూపంలోనే ఇంకా సుమారు మరో 10కోట్లు పైగానే వసూలు చేయాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.