Begin typing your search above and press return to search.

వెంకీతో మెగా హీరో ముహూర్తం

By:  Tupaki Desk   |   17 Jun 2017 12:54 PM IST
వెంకీతో మెగా హీరో ముహూర్తం
X
మెగా ఫ్యామిలీలో మిగిలిన వారికి భిన్నంగా వరుణ్ తేజ్ చకచకా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా తనవరకు అభిమానులను నిరాశ పరచకుండా మెప్పించుకుంటూ వస్తున్నాడు. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమా చేస్తున్నాడు. ఇందులో మళయాళ ప్రేమమ్ సినిమాలో మలర్ పాత్రలో అందరి గుండెలు కొల్లగొట్టిన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. క్లీన్ అండ్ నీట్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని వరుణ్ తేజ్ నమ్ముతున్నాడు.

ఓ వైపు ఫిదా చేస్తుండగానే వరుణ్ తేజ్ తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించేశాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై తర్వాత సినిమా చేస్తున్నాడు. రాశీ ఖన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం షాట్ కూడా తీశారు. ప్రస్తుతం ఫిదా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టీజర్ విడుదలకు కూడా రంగం సిద్ధమైంది. ఫిదా షూటింగ్ పనులు పూర్తయిన వెంటనే వెంకీ అట్లూరి సినిమా కోసం పూర్తి టైం వెచ్చించనున్నాడు.

వరుణ్ తేజ్ రొటీన్ కమర్షియల్ జోనర్ లో చేసిన మిస్టర్ - లోఫర్ బాక్సాఫీస్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ముకుంద - కంచెలాంటి సినిమాలు యావరేజ్ గా ఆడటంతో పాటు వరుణ్ తేజ్ కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఫిదా మూవీతో ఫామ్ లోకి వస్తానని వరుణ్ తేజ్ మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/