Begin typing your search above and press return to search.

వరుణ్.. పూరికి అసిస్టెంటుగా చేశాడట

By:  Tupaki Desk   |   19 Feb 2018 8:26 AM GMT
వరుణ్.. పూరికి అసిస్టెంటుగా చేశాడట
X
హీరోలు.. నటుల కొడుకులు ఆటోమేటిగ్గా హీరోలే అవుతారు. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్రాడు వేరే వైపు వెళ్తాడని ఎలా అనుకుంటాం. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సైతం అనుకున్నట్లే హీరో అయ్యాడు. ప్రతిభ చాటుకున్నాడు. ఐతే ముందు సినీ రంగంలో ఏమవ్వాలో తెలియక తాను దర్శకత్వ విభాగంలో పని చేసినట్లు వరుణ్ వెల్లడించాడు. తన తండ్రి సలహా మేరకు తాను పూరి జగన్నాథ్ దగ్గర ఓ సినిమాకు అసిస్టెంటుగా చేసినట్లు అతను వెల్లడించాడు.

‘‘నాకు సినిమాలంటే ఆసక్తి ఉండేది కానీ.. ఏ విభాగంలో పని చేయాలో తెలియక సతమతం అయ్యేవాడిని. అలాంటి సమయంలోనే నాన్న ఒక రోజు పిలిచి దర్శకత్వం వైపు వెళ్లమన్నారు. తర్వాత పూరి జగన్నాథ్ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు ఆయన ‘చిరుత’ సినిమా తీస్తున్నారు. ఒక్క రోజు మాత్రం అక్కడ పని చేశాను. తర్వాతి రోజు నుంచి వెళ్లలేదు. కొన్ని రోజుల తర్వాత పూరి గారిని కలిసినపుడు.. ‘నువ్వు దర్శకుడిగా పనికి రావని.. హీరోగానే బాగా పనికొస్తావని ముందే అనుకున్నా’ అని అన్నారు. అలా ఒక్క రోజు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. ఆ తర్వాత పూరి గారితోనే హీరోగా ‘లోఫర్’ సినిమా చేశాను’’ అని వరుణ్ వెల్లడించాడు. తనలో ఒక హీరో ఉన్నాడని గుర్తించింది చిరునే అని.. ‘మగధీర’ షూటింగ్ సందర్భంగా రాజస్థాన్లో ఆయన తన ఫొటోలు తీసి.. సినిమాల్లోకి రాగల లుక్స్ తనకున్నాయని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చారని వరుణ్ తెలిపాడు.