Begin typing your search above and press return to search.
నెలపాటు హీరో లేకుండానే మెగా మూవీ షూటింగ్
By: Tupaki Desk | 27 Jun 2020 7:00 AM GMTమెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఒక బాక్సిండ్ బ్యాక్ డ్రాప్ లో చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. వైజాగ్ లో చిత్రీకరణ ఫుల్ స్పీడ్ గా జరుగుతున్న సమయంలో మహమ్మారి వైరస్ కారణంగా షూటింగ్ ను అర్థాంతరంగా నిలిపేయడం జరిగింది. షూటింగ్స్ మళ్లీ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ మెగా మూవీని కూడా మళ్లీ ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నాడు. దర్శకుడు కిరణ్ అందుకు సిద్దం అవుతున్నాడట.
జులై చివరి వారం నుండి మళ్లీ వైజాగ్ లో చిత్రీకరణ జరపనున్నారు. అయితే ఆగస్టు నెలలో వరుణ్ తేజ్ కు చెల్లి నిహారిక వివాహ నిశ్చితార్థం ఉంది కనుక ఆయన షూటింగ్ కు హాజరు అవ్వడం లేదు. వరుణ్ లేకుండానే ముఖ్యమైన నటీనటులతో ఆగస్టు నెల మొత్తం షూటింగ్ ను దర్శకుడు కిరణ్ చేయనున్నాడట. సెప్టెంబర్ మొదటి లేదా రెండవ వారంలో సినిమా షూటింగ్ లో వరుణ్ తేజ్ జాయిన్ అవుతాడనే టాక్ వినిపిస్తుంది.
సినిమా షూటింగ్ కు పాల్గొనకున్నా కూడా బాక్సింగ్ పై పట్టు కోల్పోవద్దనే ఉద్దేశ్యంతో ప్రతి రోజు గంట నుండి రెండు గంటల వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడట. ఈ చిత్రంతో అల్లు అరవింద్ పెద్దబ్బాయి అల్లు బాబీ నిర్మాతగా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గద్దలకొండ గణేష్ వంటి హిట్ చిత్రం తర్వాత వరుణ్ చేస్తున్న మూవీ అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.