Begin typing your search above and press return to search.
సీనియర్ హీరోపై గౌరవంతో క్రేజీ ఆఫర్ వదిలేశాడు!
By: Tupaki Desk | 1 Dec 2022 3:48 AM GMTఖిలాడీ అక్షయ్ కుమార్ కి బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ హేరాఫేరితో ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. కానీ నిర్మాత ఫిరోజ్ తో విభేధాల కారణంగా అక్షయ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించాడు.
అక్షయ్ కుమార్ స్థానంలో ప్రతిష్ఠాత్మక 'హేరా పేరి 3' కోసం యువహీరో కార్తిక్ ఆర్యన్ ని నిర్మాత ఎంపిక చేసుకున్నారు. ఇలాంటి రకరకాల కారణాల వల్ల గత 2 వారాల్లో ఎక్కువగా చర్చల్లో నిలిచిన చిత్రంగా హేరా ఫేరి 3 నిలిచింది. ఎప్పటి నుంచో ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనే చర్చ నడుస్తోంది. అనీస్ బాజ్మీని ఒప్పించాలని టీమ్ ఆసక్తిగా ఉన్నప్పటికీ అతడి నుంచి నో అనే ఆన్సర్ వచ్చింది.
ముంబై మీడియా సమాచారం మేరకు.. హేరాఫేరి 3ని అక్షయ్ వదులుకోవడానికి కారణాలు అనేకం. నిర్మాత ఆనంద్ పండిట్.. ఫిరోజ్ నదియాడ్ వాలాతో ఈ చిత్రం కోసం భాగస్వామి కావాలని నిర్ణయించుకున్నప్పుడు అక్షయ్ కుమార్ పారితోషికం భారీగా డిమాండ్ చేశారని అది సమస్యగా మారిందని కథనాలొచ్చాయి. ఇదేగాక స్క్రిప్టు పరంగా క్రియేటివ్ డిఫరెన్సెస్ ప్రధాన సమస్యగా మారాయి. ఇలాంటి చాలా విషయాలు వర్కవుట్ కాని క్రమంలో నిర్మాతలు మొదట హేరా ఫేరి 3 లో నటించాల్సిందిగా వరుణ్ ధావన్ ని కలిసారు. ఫిరోజ్ - ఆనంద్ ఇద్దరూ వరుణ్ ధావన్ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకి కావాలనుకున్నారు. ఇద్దరు నిర్మాతలు డేవిడ్ ధావన్ కి రోహిత్ ధావన్ తో కో-డైరెక్టర్‌గా దర్శకత్వం వహించడానికి ఆఫర్ ని కూడా ఇచ్చారు అని తెలిసింది.
కానీ ఆ తర్వాత ఊహించని ట్విస్ట్. ఈ ఆఫర్ ఎగ్జయిట్ చేసినా కానీ అక్షయ్ కుమార్ పై గౌరంతో ఆ ఫ్రాంచైజీలో ప్రవేశించడానికి వరుణ్ ధావన్ ఇష్టపడలేదుట. అతనికి అక్షయ్ కుమార్ పై విపరీతమైన గౌరవం ఉంది. దీనివల్ల ఈ కొత్త సమీకరణాన్ని తనకోసం ఉపయోగించుకోవాలని అనుకోలేదు. హేరా ఫేరి 3 ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ తన సీనియర్ హీరో అయిన అక్షయ్ పై గౌరవంతో ఈ చిత్రం నుండి వరుణ్ గౌరవంగా తప్పుకున్నాడు. అతని తండ్రి డేవిడ్ ధావన్ కూడా అలాగే ఈ ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించారు. కానీ ఫిరోజ్ ఈ సినిమాని కేవలం వ్యాపారంగా మాత్రమే చూశారని.. ఖిలాడీతో సంబంధాలు కొనసాగించలేదని విమర్శలొచ్చాయి.
కొన్ని వరుస చర్చల తర్వాత వరుణ్ - డేవిడ్ తమ నిర్ణయాన్ని ఫిరోజ్ - ఆనంద్ లకు తెలియజేశారు. ప్రస్తుతం అనీష్ బజ్మీకి కాల్షీట్ల సమస్య తలెత్తడంతో ఫిరోజ్ దర్శకుడి కోసం వెతుకుతున్నాడు. అయితే ఆనంద్ పండిట్ సినిమా చేయవచ్చు లేదా చేయకపోవచ్చని కూడా మరో సోర్స్ ద్వారా తెలిసింది.
పాన్ ఇండియా హీరో అవుతాడా?
వరుణ్ ధావన్ నటించిన తాజా చిత్రం బేధియా హిందీ బెల్ట్ లో మిశ్రమ ఫలితం అందుకుంది. ఇక తెలుగులో తోడేలు పేరుతో అనువాదమై విడుదలైనా కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ సినిమాతో పాటు పోటీపడుతూ అల్లరి నరేష్ మారేడుమిల్లి ప్రజానీకం.. తమిళ అనువాద చిత్రం లవ్ టుడే విడుదలైన సంగతి తెలిసిందే. నరేష్ సినిమా ఫర్వాలేదనిపించగా.. దిల్ రాజు విడుదల చేసిన లవ్ టుడే విజయం సాధించింది.
నిజానికి వరుణ్ ధావన్ లాంటి యంగ్ ట్యాలెంటెడ్ బాలీవుడ్ స్టార్ నటించిన బేధియా తెలుగు అనువాదం తోడేలు బావుంటుందని అంతా గెస్ చేసారు. కానీ దీనికి బాక్సాఫీస్ విశ్లేషకులు పూర్ అనే మార్కులే వేసారు. పాన్ ఇండియా ట్రెండ్ లో హిందీ హీరోల ఆలోచనా ధోరణి మారింది. ఇప్పడు అంతా దక్షిణాది వైపు చూస్తున్నారు. యువహీరో వరుణ్ ధావన్ కూడా మునుముందు పాన్ ఇండియా స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకోవాలని దక్షిణాది మార్కెట్ ని కొల్లగొట్టాలనే ప్రణాళికతో ఉన్నాడు. కానీ అది ఎప్పటికి సాధ్యం అన్నది వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.