Begin typing your search above and press return to search.

జనాల్లో నానలేదు కానీ ‘అరవ’ సినిమా అదరగొట్టేసిందిగా?

By:  Tupaki Desk   |   14 Oct 2021 4:30 AM GMT
జనాల్లో నానలేదు కానీ ‘అరవ’ సినిమా అదరగొట్టేసిందిగా?
X
కొత్త ప్లాట్ తో వచ్చే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. రోటీన్ కు భిన్నంగా సాగే స్క్రీన్ ప్లే.. స్ర్కీన్ మీద చూస్తున్నది డబ్బింగ్ సినిమానే అయినప్పటికీ.. అలాంటి ఫీల్ లేకుండా చేయటం అంత తేలికైన విషయం కాదు. ప్రాక్టికల్ గా సాధ్యం కాదనిపిస్తూనే.. లాజిక్ మిస్ కాకుండా.. కథ నుంచి డైవర్టు కాకుండా.. అందులో మునిగిపోయేలా మూవీ తీయటం అంత తేలికైన విషయం కాదు. ఇలా కథ విషయంలోనూ.. దాన్ని అందంగా.. ఆకట్టుకునేలా తీర్చిదిద్దటంలో సక్సెస్ అయినప్పటికీ.. దాన్ని సరైన రీతిలో లాంఛ్ చేయటంలో ఫెయిల్ అయిన అరుదైన ఉదంతంగా దీన్ని చెప్పాలి.

సెకండ్ వేవ్ తర్వాత బడా హీరోల సినిమాలు రాకున్నా.. మంచి కథ.. కథనంతో సందడి చేసిన సినిమాలు తక్కువేం కాదు. వారం తిరిగేసరికి మినిమం మూడు.. మ్యాగ్జిమం ఏడు కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్న పరిస్థితి. గత వారాంతంలో విడుదలైన సినిమాల్లో మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రేక్షకుల్ని థియేటర్ కు వెళ్లేలా చేసిన మూవీ ‘వరుణ్ డాక్టర్’.

ఈ అరవ సినిమాకు శివ కార్తికేయన్ హీరో కావటం ప్లస్ పాయింట్ గా చెప్పాలి. తాను గతంలో చేసిన సినిమాలకు ఫూర్తి భిన్నమైన సినిమాను అతగాడు ఎంచుకున్నాడు. ఈ సినిమా ప్రత్యేకత ఏమంటే.. సిల్లీగా అనిపిస్తూనే.. సీరియస్ గా సినిమాతో కనెక్టు కావటం.. అదే పనిగా నవ్వులు పూయిటం ప్రత్యేకతగా చెప్పాలి. కానీ.. వంటకం అదిరేలా ఉన్నా.. దాన్ని తినే వారెవరూ లేకుంటే ఎలా ఉంటుందో.. వరుణ్ డాక్టర్ విషయంలోనూ అదే జరిగింది.

శుక్రవారం విడుదలయ్యే సినిమాకు బదులుగా ఒక రోజు ఆలస్యంగా శనివారం విడుదల కావటం ఒక తప్పు అయితే.. ఈ సినిమా మీద ప్రచారాన్ని పెద్దగా నిర్వహించకపోవటం..అరకొర థియేటర్లలో మాత్రమే విడుదలయ్యేలా ప్లాన్ చేసుకోవటం సినిమాను దెబ్బ తీసేలా చేసిందని చెప్పాలి. సినిమాను చూడాలని అనుకున్నా.. ఆడే థియేటర్లు తక్కువగా ఉండటంతో చాలామంది థియేటర్లకు వెళ్లలేని పరిస్థితి. గొప్పగా తీయకున్నా.. బడాయిగా ప్రచారం చేసుకునే విషయంలో ఏ మాత్రం తగ్గని ఈ రోజుల్లో.. భిన్నమైన సినిమాను తీసి.. ప్రచారలోపం కారణంగా తాను మూటగట్టాల్సిన కాసుల్ని మూట కట్టు కోలేని మూవీగా మిగిలిందని చెప్పాలి. సినిమాను చూసిన ప్రేక్షకుడు.. తనకు తానే ప్రచారకర్తగా మారాడు. అందుకు భిన్నంగా ఈ సినిమాను విడుదల చేస్తున్న నిర్మాత మరికాస్త ఫోకస్ పెట్టి ఉంటే.. నాలుగు రాళ్లు మిగిలేవన్న మాట వినిపిస్తోంది.