Begin typing your search above and press return to search.
ఎన్ని పేర్లు మారుస్తారండీ బాబూ..!
By: Tupaki Desk | 16 Sep 2015 1:30 PM GMTఇటీవల ఒక్కో సినిమాకి రెండు మూడు పేర్లు ప్రచారంలోకి వస్తున్న విషయం తెలిసిందే. పేర్లు బాగున్నాయి కదా అని మూడు పేర్లు మాత్రం ఫిక్స్ చేయరు. బయటికి వదిలిన టైటిళ్లలో దేనికి బెస్ట్ రెస్పాన్స్ వస్తే దాన్నే ఫిక్స్ చేసేస్తున్నారు. అయితే వంశీ తీసిన ఓ సినిమాకి మాత్రం మూడు పేర్లు పెట్టేశారు. చిత్రంగా అనిపిస్తోంది కదా. కానీ ఇది నిజం. ఓ సినిమాకి వెంట వెంటనే పేర్లు మారుతుండటం చూసి `ఎన్నిసార్లు పేర్లు మారుస్తారండీ బాబూ..` అంటూ కామెంట్ చేస్తున్నారు సినీ జనాలు.
అజ్మల్ కథానాయకుడిగా `తను మొన్నే వెళ్లిపోయింది` పేరుతో వంశీ ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పుడెప్పుడో సెట్స్‌పైకి వెళ్లిన ఆ చిత్రం ఎంతకీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. పేరు అచ్చిరాలేదనుకొన్నారో ఏంటో వెంటనే `మెల్లగా తట్టింది మనసు తలుపు` అని పేరును మార్చేశారు. అయినా సినిమా మాత్రం విడుదల కాలేదు. తాజాగా మళ్లీ పేరు మార్చారు. ఈసారి `వెన్నెల్లో హాయ్ హాయ్` అంటూ పేరు పెట్టేశారు. వంశీ తీసిన `ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు` సినిమాలో `వెన్నెల్లో హాయ్ హాయ్...` అంటూ ఓ పాట సాగుతుంటుంది. ఆ పాట పల్లవినే ఇప్పుడు వంశీ సినిమాకి పేరుగా మారిపోయింది. మరి మూడో పేరైనా కలిసొచ్చి సినిమా విడులవుతుందేమో చూడాలి. ఇదో ప్రేమకథతో తెరకెక్కినట్టు సమాచారం.