Begin typing your search above and press return to search.
అల్లు అర్జున్ కు సజ్జనార్ హెచ్చరిక
By: Tupaki Desk | 11 Nov 2021 5:31 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ర్యాపిడో ప్రకటన వివాదాస్పదమైంది. ఆ యాడ్ లో ఆర్టీసీని అవమానించేలా వ్యవహరించాడనే ఆరోపణలున్నాయి. ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సదురు వాణిజ్య ప్రకటనను ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తోపాటు ర్యాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన సజ్జనార్ దీనిపై మాట్లాడారు. అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థ తక్షణమే ఆర్టీసీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చే విధంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.
అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థతో తనకు ఎలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవని.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా వ్యవహరించారు కాబట్టే నోటీసులు ఇచ్చామని సజ్జనార్ స్పష్టం చేశారు. తాము ఇచ్చిన నోటీసులకు సమాధానం రాకపోతే న్యాయపరంగా ముందుకు వెళతామని ఆయన హెచ్చరించారు.
సెలబ్రెటీలు కమర్షియల్ యాడ్స్ లో నటించే ముందు జాగ్రత్తగా చూసి నటించాలని ఈ సందర్భంగా సినీ హీరోలకు సజ్జనార్ సూచించారు. ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించకూడదని ఆయన హితవు పలికారు. సినిమా వాళ్లు మరింత బాధ్యతగా ఉండాలని గుర్తు చేశారు.
ఇక ఎవరైనా తమ ప్రొడక్ట్ గురించి ప్రమోషన్ చేసుకోవచ్చు కానీ.. ఇతర ప్రొడక్ట్ లను కించపరచూకూడదనే విషయాన్ని గుర్తించాలని సజ్జనార్ హితవు పలికారు. ఆర్టీసీతో ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంటుందని.. దాన్ని అవమానించవద్దని సూచించారు.