Begin typing your search above and press return to search.
VD12 ముహూర్తం పెట్టేశారు..!
By: Tupaki Desk | 3 May 2023 1:29 PM GMTయూత్ ఆడియన్స్ లో ఈతరం హీరోల్లో ఒక రేంజ్ లో ఫాలోయింగ్ ఏర్పరచుకున్న హీరో విజయ్ దేవరకొండ. డియర్ కామ్రెడ్, వరల్డ్ ఫేమస్ లవ, లైగర్ వరుసగా 3 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
అర్జున్ రెడ్డితో తన స్టామినా ఏంటో చూపించిన విజయ్ తనను సరిగా వాడుకోలేకపోవడం దర్శకుల మిస్టేక్ అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. లైగర్ ఇచ్చిన షాక్ తో కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి వెంటనే శివ నిర్వాణ డైరక్షన్ లో ఖుషి సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాలో సమంతతో జత కడుతున్నాడు రౌడీ బోయ్.
ఆల్రెడీ వీరిద్దరు కలిసి మహానటిలో నటించారు. ఇద్దరి పోర్షన్ ఆ సినిమాకు వన్ ఆఫ్ ది హైలెట్ గా నిలిచింది. ఇక లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా ముహూర్తం పెట్టేశాడు. నేడు రామానాయుడు స్టూడియోలో VD12 సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి.
జెర్సీ తో ప్రతిభ చాటిన గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోన్ మూవీస్, శ్రీకర స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలని ఫిక్స్ చేశారు.
ధమాకాతో హిట్ అందుకున్న శ్రీ లీల వరుస క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది. ఇప్పటికే హారిక హాసిని వారు నిర్మిస్తున్న మహేష్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్న అమ్మడు. ఎన్.బి.కె 108 లో కూడా నటిస్తుంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఆమెని ఫిక్స్ చేశారు. ఇప్పుడు విజయ్ సరసన కూడా శ్రీ లీల ఛాన్స్ కొట్టేసింది. కన్నడ భామకు తెలుగులో బాగా వర్క్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు.
ఇక గౌతం తిన్ననూరి, విజయ్ దేవరకొండ సినిమా విషయానికి వస్తే ఇదొక స్పై థ్రిల్లర్ గా వస్తుందని తెలుస్తుంది. జెర్సీని హిందీలో కూడా సత్తా చాటిన గౌతం తిన్ననూరి ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారా లేదా అన్నది చూడాలి. ఖుషి హిట్ పడితే ఆ వరుసలో గౌతం తిన్ననూరితో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ.