Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీలో విషాదం.. అనారోగ్యంతో 'వేదం' నాగయ్య మృతి!
By: Tupaki Desk | 27 March 2021 8:47 AM GMTసినీ ఇండస్ట్రీలో వరుస విషాదలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది ఎంతోమంది ప్రముఖులను కోల్పోయింది ఇండస్ట్రీ. లెజెండరి సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంను అలాగే ఎందరో మహనీయులను కోల్పోయింది సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు మరో టాలీవుడ్ సినీ ఆర్టిస్ట్ మరణించారు. వేదం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న నాగయ్య. ఆ సినిమా నుండి వేదం నాగయ్యగా పాపులర్ అయ్యారు. ఆ సినిమా తర్వాత చాలా సినిమాల్లో నటించారు కానీ ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలబడలేకపోయారు. ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టడమే చాలా వయసు మీదపడిన తర్వాత వచ్చారు. అందుకే ఆయన సూట్ అయిన క్యారెక్టర్స్ దొరకలేదు.
ఇదిలా ఉండగా.. గతకొంత కాలంగా నాగయ్యకు ఆరోగ్యం బాగుండటం లేదట. అనారోగ్యం కారణంగా నాగయ్య మరణించారు. కొద్దికాలం కిందటే ఆయన భార్యను కూడా కోల్పోయారు. ప్రస్తుతం నాగయ్య మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నాగయ్య తన కెరీర్లో వేదం తరువాత.. ఒక్కడినే, నాగవల్లి, రామయ్యా వస్తావయ్యా, స్పైడర్ లాంటి సినిమాలలో కనిపించారు. నాగయ్య స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర దేసవరంపేట అనే గ్రామం. అక్కడినుండి ఆయన కొడుకుతో హైదరాబాద్ పయనమై వేదం సినిమాలో అవకాశం అందుకున్నాడు. అప్పుడు పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ కొంతకాలం తర్వాత సినిమాలు లేక ఆకలితో భిక్షాటన కూడా చేసినట్లు తెలుస్తుంది. ఆ పరిస్థితిలో సీఎం కెసిఆర్ నాగయ్యకు లక్ష రూపాయలు ఆర్థికసాయం చేశారు. అనంతరం మా అసోసియేషన్ వారు ప్రతినెలా నాగయ్యకు 2500/- పింఛన్ అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం నాగయ్య మరణంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.