Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ నో అన్న స్టోరీ బాల‌య్య చెంత‌కు

By:  Tupaki Desk   |   23 Dec 2015 6:47 AM GMT
ఎన్టీఆర్ నో అన్న స్టోరీ బాల‌య్య చెంత‌కు
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌ లో తెర‌కెక్కుతున్న నాన్న‌కు ప్రేమ‌తో సినిమా వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాల శివ డైరెక్ష‌న్‌ లో జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో న‌టించ‌నున్నాడు. జ‌నతా గ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్ కోలీవుడ్ బ్లాక్‌ బ‌స్ట‌ర్ మూవీ వేదాళం సినిమా రీమేక్‌ లో న‌టిస్తాడ‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఎన్టీఆర్ ఈ వార్త‌ల‌ను ఖండించాడు. గ‌తంలో కూడా త‌మిళ హిట్ సినిమాలైన కత్తి - జిల్లా రీమేక్ లు ఎక్కువకాలం ఎన్టీఆర్ కోసమే ఆగాయి కాని ఎన్టీఆర్ నో చెప్పడంతో
ఆ ప్రాజెక్టులు ప‌ట్టాలెక్క‌లేదు.

ఇప్పుడు వేదాళం సినిమా విష‌యంలో కూడా అదే జ‌రిగింది. ఎన్టీఆర్ రీమేక్ సినిమాల్లో న‌టించేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తి చూప‌డ‌న్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఎన్టీఆర్‌ కు వేదాళం సినిమా రీమేక్‌ లో న‌టించే ఛాన్స్ వ‌చ్చినా ఆ స్టోరీ తాను గ‌తంలో న‌టించిన ఊస‌ర‌వెల్లి సినిమా లైన్‌ ను పోలీ ఉంద‌న్న కార‌ణంతో రిజ‌క్ట్ చేశాడ‌న్నమ్యాట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఇప్పుడు ఇదే స్టోరీ బాబాయ్ బాలకృష్ణ దగ్గరకు వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం 99 వ సినిమాను ఫినిష్ చేసి బోయపాటితో 100 సినిమాకి రెడీ అవుతున్న బాలయ్య స్టామినాకి ఈ స్టోరీ పెర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని వేదాళం నిర్మాత‌లు బాల‌య్య‌ను అప్రోచ్ అయ్యార‌ట‌.

వేదాళం స్టోరీ ప్ర‌ధానంగా సిస్ట‌ర్ సెంటిమెంట్‌ ను బేస్ చేసుకుని ఉంటుంది...ఈ స్టోరీ లైన్‌ తో ఇప్ప‌టికే ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. బాల‌య్య త‌న కేరీర్‌ లోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన వందో సినిమా విష‌యంలో రీమేక్ స్టోరీని ఎంచుకుంటాడా అన్న‌ది కూడా సందేహ‌మే.