Begin typing your search above and press return to search.

వీడియో : 50 ఏళ్ల వయసులో ఇంత ఎనర్జినా?

By:  Tupaki Desk   |   16 Nov 2019 4:01 PM IST
వీడియో : 50 ఏళ్ల వయసులో ఇంత ఎనర్జినా?
X
తెలుగు ప్రేక్షకులకు అక్కినేని అమల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పటి హీరోయిన్‌ గా ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జున భార్యగా.. అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ తల్లిగా అమల ఎప్పుడు మీడియాలో ఉంటూనే ఉన్నారు. అమల అక్కినేని సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటారనే విషయం తెల్సిందే. తన వ్యక్తిగత మరియు వృత్తికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసే అమల అక్కినేని ఈసారి ఒక వీడియోను షేర్‌ చేసింది. జిమ్‌ లో కసరత్తులు చేస్తున్న వీడియోను ఆమె పోస్ట్‌ చేసి అందరిని ఆశ్చర్య పర్చింది.

వికీపీడియా ప్రకారం అక్కినేని అమల వయసు 52 ఏళ్లు. ఈ వయసులో సాదారణంగా మహిళలు బాబోయ్‌ నాకెందుకులే అనుకుని జిమ్‌ కు దూరంగా ఉండటంతో పాటు బాడీ విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోరు. కాని అమల అక్కినేని మాత్రం ఇంకా రెగ్యులర్‌ గా జిమ్‌ కు వెళ్లడంతో పాటు అమ్మాయిల కంటే ఎక్కువగా వర్కౌట్స్‌ చేస్తుందట. తాజాగా ఆమె షేర్‌ చేసిన వీడియో ఆ విషయాన్ని చెప్పకనే చెబుతుంది. ఈమె ఏకంగా 71 కేజీల వెయిట్‌ ను ఎత్తేసింది. అలవోకగా ఆ వెయిట్‌ ను లిఫ్ట్‌ చేసి అందరు నోరు వెళ్లబెట్టేలా చేసింది.

ఈ రోజు 71 కేజీల బరువు ఎత్తాను. ఆడవారు బలమైన వారు కాదని ఎవరు అన్నారు. స్ట్రాంగ్‌ మైండ్‌ తో పాటు బాడీ కూడా స్ట్రాంగ్‌ గా ఉంచుకోవాలంటూ ప్రతి ఒక్కరికి సూచించింది. సెలబ్రెటీలు జిమ్‌ లో వర్కౌట్స్‌ ఇలా సోషల్‌ మీడియాలో పెట్టడం చాలా కామన్‌ గా చూస్తూనే ఉటాం. కాని అమల అక్కినేని వెయిట్‌ లిఫ్టింగ్‌ మాత్రం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ వయసులో అంత వెయిట్‌ లిఫ్ట్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు.. మీరు గ్రేట్‌ మేడం.. మీరు అందరికి ఆదర్శం మేడం అంటూ వీడియోకు కామెంట్స్‌ చేస్తున్నారు.