Begin typing your search above and press return to search.

చేతులారా సినిమాని చంపేసుకోవడం ఎలా?

By:  Tupaki Desk   |   25 Oct 2018 4:37 AM GMT
చేతులారా సినిమాని చంపేసుకోవడం ఎలా?
X
అసలు ప్రీమియర్ షోలు ఎందుకు వేయాలో వాటి వల్ల ఎలాంటి పరిణామాలు ఉండవచ్చో పూర్తిగా అవగాహన లేకుండా వేస్తున్న తప్పటడుగులు కొందరు నిర్మాతలకు చేటు చేస్తున్నాయి. ముందే షోలు వేసి చూపిస్తే మౌత్ పబ్లిసిటీ బాగా పనిచేస్తుందన్న వాళ్ళ గుడ్డి నమ్మకం అసలుకే మోసం చేస్తూ బురిడి కొట్టిస్తున్నాయి. కేరాఫ్ కంచేరపాలెంకు లెక్కలేనన్ని షోలు వేసి అద్భుతమైన ప్రీ రిలీజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్ళ పరంగా అది సాధించింది ఏమి లేదు. కంటెంట్ ఉన్న వాటి పరిస్థితే అలా ఉంటె ముందు నుంచే అనుమానాలు ఉన్న ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా.

వీరభోగవసంతరాయలు మేకర్స్ కు ఇది అనుభవంలోకి వస్తోంది. మరీ విడ్డూరంగా యుఎస్ లో మూడు రోజుల ముందే ప్రీమియర్లు వేసేందుకు సాహసించిన నిర్మాతకు ఇప్పుడు అదే శాపంగా మారింది. ఆన్ లైన్ తో పాటు సోషల్ మీడియాలో అక్కడి నుంచి వచ్చిన నెగటివ్ రిపోర్ట్స్ విపరీతంగా స్ప్రెడ్ కావడంతో రేపు ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపనుంది. నిజానికి దీనికి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏమంత బజ్ లేదు. మల్టీ స్టారర్ అని చెప్పుకున్నప్పటికి మార్కెట్ పరంగా ఎవరూ కనీస స్థాయిలో ఓపెనింగ్స్ తెచ్చే వారు కాకపోవడంతో జనానికి పెద్దగా ఆసక్తి లేదు. పైగా అయోమయం సృష్టించేలా దీని జానర్ గురించి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేలా పబ్లిసిటీ చేయడం కూడా తేడా కొట్టింది.

మొత్తానికి ఏదో సామేత చెప్పినట్టు దేనికో మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని మూడు రోజుల ముందే షోలు వేసుకుని చాటింపు చేసుకోవడం ఎంత చేటో అందరికి ఉదాహరణగా నిలుస్తోంది వీరభోగవసంతరాయలు. రేపు ఇక్కడ కూడా ఫలితం తేలిపోతుంది కాబట్టి లేట్ వెయిట్ అండ్ సి.