Begin typing your search above and press return to search.
ఓవర్సీస్ రిపోర్ట్ తేడా కొట్టేసిందిగా!
By: Tupaki Desk | 24 Oct 2018 12:03 PM GMTవిడుదలకు ఏకంగా మూడు రోజుల ముందే యుఎస్ ప్రీమియర్లకు శ్రీకారం చుడదామనుకున్న వీరభోగవసంతరాయలు మేకర్స్ కు అదే బూమరాంగ్ లాగా తిరిగి వచ్చి కొట్టుకునేలా ఉంది. ఇవాళ వేసిన షోల నుంచి పూర్తిగా నెగటివ్ రివ్యూలు రావడం దీనికి కారణం అని చెప్పొచ్చు. ఇప్పటికే యుఎస్ లో చూసిన ప్రేక్షకుల నుంచి తీసుకున్న అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని ఓ మీడియా వర్గంతో పాటు ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ మీద సైతం ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
నిజానికి కొద్దిరోజుల ముందు షోలు వేయడం అనేది చిన్న బడ్జెట్ వాటికి సహజంగా చేస్తూ ఉంటారు. కానీ ఇందులో కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ స్టార్లు ఉన్నారు. హడావిడి పబ్లిసిటీ చేసినా మ్యాటర్ ఏదైనా ఉంటుందా అనే అనుమానం మధ్యే డేట్ కూడా ప్రకటించారు. డెబ్యూ డైరెక్టర్ ఇంద్రసేన ఎలా డీల్ చేసుంటాడా అనే అనుమానాల మధ్యే మొత్తానికి ఇవాళ వీరభోగవసంతరాయలు వేంచేశారు.
ఇప్పుడు ఈ రిపోర్ట్స్ ప్రభావం ఖచ్చితంగా ఇక్కడ ఉండదు అని చెబితే అబద్దమే అవుతుంది. ఇప్పటికే పబ్లిసిటీ లోపాల కారణంగా హైప్ ఆశించిన స్థాయిలో రాలేదు. బుకింగ్ కూడా ఇవాళ ఉదయం దాకా ఆన్ లైన్ లో అందుబాటులోకి రానే లేదు. ఈ నేపధ్యంలో ఇక్కడ ఇలా వదిలేసి ఓవర్సీస్ మీదే ఫోకస్ పెట్టడం రెంటికి చెడ్డ రేవడిల మార్చినట్టు అయ్యింది. నారా రోహిత్ సుధీర్ బాబు శ్రేయ శ్రీ విష్ణు ఇలా ఎవరిని సరైన రీతిలో వాడుకోకపోవడం వల్లే అవుట్ ఫుట్ చాలా తీసికట్టుగా ఉందని అక్కడి రిపోర్ట్స్ ని బట్టి అర్థమవుతోంది.
మరి రచ్చ ఓడి ఇంటికి వస్తున్న వీరభోగవసంతరాయలు ఇక్కడైనా అంత ఈజీగా గెలుస్తాడా అనే దాని రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే సోషల్ మీడియాలో హంగామా మొదలైపోయింది. రాక ముందే దెబ్బ పడటం అంటే ఇదేనేమో.