Begin typing your search above and press return to search.
ఆ సినిమాకు మూడు రోజుల ముందే ప్రిమియర్లు
By: Tupaki Desk | 10 Oct 2018 10:06 AM GMTదసరా సందడి తర్వాత తెలుగులో ఒక ఆసక్తికర సినిమా రాబోతోంది. నారా రోహిత్.. సుధీర్ బాబు.. శ్రీ విష్ణు.. శ్రియ సరన్.. ఇలాంటి చిత్రమైన కాంబినేషన్లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ‘వీర భోగ వసంత రాయలు’ అక్టోబరు 26న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అమెరికాలో మూడు రోజుల ముందే ప్రిమియర్లు వేయబోతుండటం విశేషం. మామూలుగా విడుదలకు ముందు రోజు ప్రిమియర్లు పడతాయి.
కానీ దీనికి ఏకంగా మూడు రోజుల ముందే.. అంటే మంగళవారమే ప్రిమియర్లు ప్లాన్ చేస్తున్నారు. ఇది చిత్ర ఫలితంపై మేకర్స్ నమ్మకాన్ని చాటి చెబుతోంది. మూడు రోజుల ముందే సినిమా రిలీజ్ చేస్తే టాక్ బయటికి వచ్చి ఏమైనా తేడా జరుగుతుందేమో అన్న భయం నిర్మాతల్లో ఉంటుంది. ఆ టెన్షన్ ఏమీ లేకుండా సినిమాను రిలీజ్ చేస్తున్నారంటే ధీమానే కావచ్చు. సినిమా బాగుంటే ఈ ప్రిమియర్ల వల్ల మంచే జరుగుతుంది. ముందే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయి.. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు కలిసొస్తుంది. మరి ప్రిమియర్లకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
‘వీర భోగ వసంత రాయలు’ చిత్రాన్ని ఇంద్రసేన అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. ఇతడి గురించి చిత్ర బృందం గొప్పగా చెబుతోంది. తెలుగులో ఇప్పటిదాకా రాని సరికొత్త కథాంశంతో ఇంద్రసేన ఈ చిత్రాన్ని రూపొందించాడట. అప్పారావు బెల్లాన ఈ సినిమాను నిర్మించాడు. ఇందులో నారా రోహిత్ చెయ్యి లేని వాడిగా కనిపించనున్నాడు. మిగతా వాళ్లకు కూడా విభిన్నమైన పాత్రల్లాగే కనిపిస్తున్నాయి. ప్రధాన పాత్రధారులందరి లుక్స్ భిన్నంగా ఉన్నాయి.