Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: వీర భోగ.. 'ఆపరేషన్ గెట్ లాస్ట్'

By:  Tupaki Desk   |   15 Oct 2018 5:08 PM GMT
ట్రైలర్ టాక్: వీర భోగ.. ఆపరేషన్ గెట్ లాస్ట్
X
నారా రోహిత్ - సుధీర్ బాబు - శ్రీ విష్ణు - శ్రియ శరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'వీర భోగ వసంత రాయలు'. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ ను కంటిన్యూ చేస్తూ సినిమాపై ఆసక్తి కలిగేలా చేసింది. ఒక ఫ్లైట్ ను హైజాక్ చేయడం.. ఒక ఇల్లు మాయమైపోవడం.. అనధలైన ఆడ పిల్లలు అదృశ్యం కావడం ఇదీ నేపథ్యం.

వీటన్నిటి వెనకాల ఎవరో ఒకరున్నారని హింట్స్ ఇచ్చినప్పటికీ అతను ఎవరు అనేది చూపలేదు. వాయిస్ ఓవర్.. నేపథ్యంలో వచ్చిన డైలాగ్స్ ను బట్టి ఆ వ్యక్తి శ్రీవిష్ణు అని ప్రేక్షకులకు అర్థం అవుతుంది. ఇక నారా రోహిత్ కిడ్నాపర్ కోసం వెతుకుతున్న క్రైమ్ బ్రాంచి హెడ్ పాత్రలో.. సుధీర్ బాబు మిస్ అయిన అడపిల్లల ఆచూకీని కనుక్కునే పోలీస్ అధికారి పాత్రలో కన్పించారు. మరోవైపు శ్రియ శరణ్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో ఈ కేసుల గురించి అరాలు తీస్తూ కనిపించింది. ఇక ట్రైలర్ లో సీన్స్ అన్నీ ఇంట్రెస్ట్ పెంచేవిధంగా ఉన్నాయి.

మార్క్ రాబిన్ నేపథ్య సంగీతం ఈ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. ఈ నేరాలకు కారణం అయిన క్రిమినల్ ను పట్టుకునేందుకు వారు పెట్టుకున్న పేరు 'ఆపరేషన్ గెట్ లాస్ట్'. ఇక నూతన దర్శకుడు అయినప్పటికీ ఇంద్రసేన ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా చేయగలగడం మెచ్చుకోవాల్సిన విషయమే. ఇక మీరు కూడా ఒకసారి ఈ థ్రిల్లింగ్ ట్రైలర్ పై లుక్కేయండి.