Begin typing your search above and press return to search.

వీర‌మ‌ల్లు మొఘ‌లుల క‌థా?

By:  Tupaki Desk   |   20 Nov 2022 2:30 AM GMT
వీర‌మ‌ల్లు మొఘ‌లుల క‌థా?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ వ్య‌యంతో 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' తెర‌కెక్కుతోన్న‌సంగ‌తి తెలిసిందే. సోషియా ఫాంట‌సీ చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఒక‌ప‌క్క పీకే రాజ‌కీయ ప‌ర్య‌ట‌న‌లు కొన‌సాగిస్తునే సిన‌మా షూటింగ్ లోనూ జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలోచిత్రీక‌ర‌ణ శ‌ర వేగంగా సాగుతోంది.

శుక్ర‌వారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ ఆధ్వ‌ర్యంలో పోరాట స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. పీకే డేట్లు ఇచ్చిన స‌మ‌యంలో మాత్రం షూటిగ్ చ‌క‌చ‌కా కానిచ్చేస్తున్నారుట‌. ఆయన బిజీ షెడ్యూల్ ని దృష్టిలో పెట్టుకుని క్రిష్ ప‌క్కా ప్లానింగ్ తో షూటింగ్ నిర్వ‌హిస్తున్నారు. వేస‌వి టార్గెట్ గా సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌న్న‌ది మేక‌ర్స్ ప్లాన్ గా తెలుస్తోంది. ఎట్టి ప‌రిస్థుతుల్లో జ‌న‌వ‌రి క‌ల్లా షూటింగ్ పూర్తిచేయాల‌ని టీమ్ భావిస్తోందిట‌.

ఈ నేప‌థ్యంలో తాజాగా సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇది మోఘ‌ల్ సామ్రాజ్యానికి సంబంధించిన క‌థ అని స‌మాచారం. ఆ చారిత్రక‌ నేప‌థ్యంతో కూడిన ఓ భాగం క‌థ‌ని తీసుకుని సినిమాకు అనుగుణంగా డ్రెమ‌టైజ్ చేసిన‌ట్లు స‌మాచారం. మెఘ‌ల సామ్రాజ్యంలో బ‌ల‌మైన రాజులుగా పాలించిన ఓ రాజు క‌థ‌ని తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఆ సామ్రాజ్యంలో చాలా మంది రాజులు పాలించారు. బాలీవుడ్ న‌టుడు బాబి డియోల్ ఔరంగ జేబు పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఆ బేస్ని ఆధారంగా చేసుకుంటే? ఔరంగ జేబు ముందు కాలం ముగింపు నుంచి అత‌ని ప్ర‌స్థానం ముగిసే వ‌ర‌కూ మూల క‌థ‌ని తీసుకునే అవ‌కాశం ఉంది. అలా కాకుండా స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ లా డ్రెమ‌టైజ్ చేస్తే క‌థ స్వ‌రూపాన్ని అంచ‌నా వేయ‌డం క‌ష్టం అవుతుంది.

గ‌తంలో క్రిష్ 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి' తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. అందులో కేవ‌లం గౌత‌మీ పుత్ర విజ‌యాల వ‌ర‌కూ తీసుకుని మూడు గంట‌ల సినిమాని చూపించారు. వీలైనంత వ‌ర‌కూ చ‌రిత్ర‌ని చెబుతూనే...క‌మ‌ర్శియ‌ల్ కోణంలో మ‌లిచారు. మ‌రి పీకే కోసం మోఘ‌ల సామ్రాజ్యంలో ఎలాంటి మార్పులు చేసారు? అన్న‌ది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.