Begin typing your search above and press return to search.

వీర సింహారెడ్డి.. మొదటి రోజు ఒక్క మల్టీప్లెక్స్‌ లో 35 షోలు

By:  Tupaki Desk   |   12 Jan 2023 9:12 AM GMT
వీర సింహారెడ్డి.. మొదటి రోజు ఒక్క మల్టీప్లెక్స్‌ లో 35 షోలు
X
నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొంది నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి సినిమా మొదటి రోజు కుమ్మేస్తోంది. విడుదల అన్ని ఏరియాల్లో కూడా సినిమా రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ ను రాబట్టుకుంటున్నట్లుగా నందమూరి అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు.

నిన్న విడుదల అయిన తెగింపు సినిమాకు తెలుగు లో పెద్దగా ఆధరణ దక్కలేదు. దాంతో మరే సినిమా లేక పోవడంతో బాక్సాఫీస్ వద్ద వీర సింహారెడ్డి ఏకచత్రాధిపత్యం అన్నట్లుగా సాగుతోంది. ప్రతి థియేటర్ లో మరియు మల్టీ ప్లెక్స్ లో సాధ్యం అయినన్ని ఎక్కువ షో లను వీర సింహారెడ్డి వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా కూకట్‌ పల్లిలోని ఒక మల్టీప్లెక్స్ లో నేడు అన్ని స్క్రీన్స్ లో అన్ని షో లను వీర సింహారెడ్డి ప్రదర్శించబోతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదనపు షో లు.. ఎర్లీ మార్నింగ్‌ షో లకు అనుమతులు ఇవ్వడంతో వీర సింహారెడ్డి ఆ ఒక్క మల్టీ ప్లెక్స్ లోనే ఏకంగా 35 షో లు ప్రదర్శించబోతున్నారు.

ఆ మల్టీ ప్లెక్స్ లో మొత్తంగా 9 స్క్రీన్స్ ఉన్నాయి. ఆ స్క్రీన్స్‌ లో ప్రతి 15 నుండి 20 నిమిషాల గ్యాప్‌ లో ఒక షో పడే విధంగా మల్టీ ప్లెక్స్ యాజమాన్యం ప్రకటించారు. భారీ ఎత్తున అడ్వాన్స్‌ బుకింగ్‌ అయిన నేపథ్యంలో ఈ విధంగా ప్లాన్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.

ఒక్క మల్టీ ప్లెక్స్‌ లో మొదటి రోజు 35 షో లు పడటం రికార్డు గా నందమూరి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ రికార్డును రేపు విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమా బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.