Begin typing your search above and press return to search.

అఖండను మించిన వీర సింహారెడ్డి.. ఎక్కడా తగ్గట్లేదుగా!

By:  Tupaki Desk   |   19 Jan 2023 1:07 PM GMT
అఖండను మించిన వీర సింహారెడ్డి.. ఎక్కడా తగ్గట్లేదుగా!
X
ఆయన ఎవరో సెలబ్రిటీ జ్యోతిష్యుడు నందమూరి బాలకృష్ణ కెరియర్ బాగుందని.. ఇప్పుడు ఆయనేది పట్టుకుంటే అది బంగారమవుతుందని గతంలో కామెంట్లు చేశారు. నిజంగా జాతకం ఎఫెక్ట్‌ ఓ లేదో తెలియదు కానీ... నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాలు మాత్రం వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. 2021 డిసెంబర్‌లో విడుదలైన అఖండ సినిమా.. నందమూరి బాలకృష్ణ కెరియర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమా కూడా అదే బాటలో పయనిస్తోంది.

అఖండ మొదటివారం వసూళ్ల విషయానికి వస్తే 53 కోట్ల 49 లక్షల షేర్ వసూళ్లు సాధించింది. మొత్తం 87 కోట్ల 9 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పుడు తాజాగా బాలయ్య సినిమా వీర సింహారెడ్డి కూడా నందమూరి బాలకృష్ణ కెరియర్‌లోనే అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా దిశగా పరుగులు పెడుతోంది.

ఒక వారంలో వీర సింహారెడ్డి సినిమా 68 కోట్ల 50 లక్షలు వసూలు చేస్తే... గ్రాస్‌గా 114 కోట్ల 95 లక్షల వసూలు చేసింది. ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్లుగా బాలకృష్ణకు నిలచాయి. ఈ రెండు సినిమాలు బాలయ్య కెరియర్‌లోని అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలుగా నిలుస్తున్నాయి.

ఇక వీర సింహారెడ్డి సినిమా విషయానికి వస్తే బాలకృష్ణ అభిమానిగా చెప్పుకుంటున్న గోపీచంద్ మలినేని తెరకెక్కించారు. ఈ సినిమాలో హనీ రోజ్, శృతిహాసన్ బాలకృష్ణ సరసన హీరోయిన్లుగా నటించారు. కన్నడ హీరో దునియా విజయ్ విలన్‌గా నటించారు.

ఈ సినిమాలో ఆయన భార్య పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిగా... నందమూరి బాలకృష్ణ, వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య కాంబినేషన్ సీన్లు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పలికిన డైలాగులు బాగా పేలడంతో సినిమాకు రిపీట్ ఆడియన్స్ కూడా వస్తున్నారు. అయితే ఈ సినిమా ఒక వర్గానికి మాత్రమే నచ్చుతుందని ఎక్కువగా హింస రక్తపాతం ఉండడంతో ఫ్యామిలీస్ అందరూ కలిసి చూడడం కాస్త ఎడ్బెట్టుగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఏదేమైనా బాలకృష్ణ కెరియర్‌లో ముందుకు దూసుకువెళ్లడం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.