Begin typing your search above and press return to search.
టెన్షన్ పెడుతున్న వీర సింహారెడ్డి రన్ టైమ్ రూమర్స్!
By: Tupaki Desk | 5 Jan 2023 10:30 AM GMTనందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కచ్చితంగా ప్రధాన ఆకర్షణగా ఉంటుంది అంటూ నందమూరి అభిమానులు చాలా నమ్మకంతో వెయిట్ చేస్తున్నారు.
బాలయ్య గత చిత్రం అఖండకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటూ బాలయ్య అభిమానుల నుండి మొదలుకుని ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు కూడా ఆశిస్తున్నారు. జనవరి 12వ తారీకున వీర సింహారెడ్డి విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల అయిన ఒక్క రోజు తర్వాత చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాను విడుదల చేయబోతున్నారు.
మెగా స్టార్ తో పోటీ ఉన్న కారణంగా కచ్చితంగా వీర సింహారెడ్డి సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. కనుక ఎడిటింగ్ విషయంలో ముఖ్యంగా రన్ టైమ్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు శ్రద్ద పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న పుకార్ల ప్రకారం ఈ సినిమా దాదాపుగా మూడు గంటల నిడివి ఉండబోతుందట.. మొదట రెండున్నర నుండి పావు తక్కువ మూడు గంటల నిడివితో తీసుకు రావాలని భావించారట. కానీ ఎంతగా ఎడిట్ చేసినా కూడా మూడు గంటల నిడివి తగ్గడం లేదని.. అంటూ పుకార్లు గుప్పుమంటున్నాయి.
సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మూడు గంటల నిడివి సమస్య కానే కాదు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలు రెండున్నర గంటల నిడివితోనే వస్తున్నాయి కనుక ఈ సినిమా పరిస్థితి ఏంటో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వీర సింహారెడ్డి యొక్క ఫైనల్ రన్ టైమ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కనుక పుకార్లు నమ్మి అభిమానులు టెన్షన్ పడాల్సిన పనిలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.