Begin typing your search above and press return to search.
ఒంగోలుకు చాపర్ లో 'వీరసింహారెడ్డి' టీమ్!
By: Tupaki Desk | 6 Jan 2023 11:30 AM GMTనందమూరి బాలకృష్ణ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వీర సింహారెడ్డి'. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపనీ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'క్రాక్' బ్లాక్ బస్టర్ తో ట్రాక్ లోకి వచ్చేసిన గోపీచంద్ మలినేని ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటించిన ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తరువాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి.
బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీని రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించ,డం, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశం రెడ్డి వంటి ఫ్యాక్షన్ చిత్రాల తరువాత బాలయ్య చేస్తున్న మరో ఫ్యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ అంశం కూడా ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ చేయబోతున్నారు.
సంక్రాంతి బరిలో చాలా ఏళ్ల విరామం తరువాత బాలయ్య బరిలోకి దిగుతున్న సినిమా కావండంతో మేకర్స్ ప్రతీ విషయంలోనూ కేర్ తీసుకుంటున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, లిరికల్ వీడియోలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. 'క్రాక్'లో కీలక పాత్రలో నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ మూవీలోనూ అంతకు మించిన పవర్ ఫుల్ క్యారెక్టర్ లో బాలకృష్ణకు సోదరిగా కనిపించబోతోంది. ఇక కన్నడ నటుడు దునియా విజయ్ పవర్ ఫుల్ విలన్ కనిపించబోతున్నారు.
ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచేసింది. ఇందులో భాగంగా ఓంగోలులో 'వీర సింహారెడ్డి' గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది. ఇందు కోసం ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈవెంట్ కోసం హీరో నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ శృతిహాసన్, నిర్మాత నవీన్ ఎర్నేని చిత్ర బృందం ప్రత్యేర చాపర్ లో ఒంగోలుకు పయన మయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
బాలయ్య డిఫరెంట్ మేకోవర్ తో కనిపిస్తుండగా, శృతిహాసన్ బ్లాక్ సారీలో కనిపిస్తోంది. శుక్రవారం జరుగుతున్న ఈవెంట్ కు అభిమానులు భారీ స్థాయిలో హాజరు అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం వారికి పలు సూచనలు చేసింది. హెవీగా క్రౌండ్ వుండే అవకాశం వున్న నేపథ్యంలో అంతా జాగ్రత్తగా వుండాలని కోరింది. ఇదిలా వుంటే ఇదే వేడుకలో 'వీర సింహారెడ్డి' ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నామని తమన్ అప్ డేట్ ఇచ్చేశాడు. దీంతో ఫ్యాన్స్ లో అప్పుడే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.