Begin typing your search above and press return to search.

వీరభద్రంకు ఛాన్సులిస్తోందెవరు?

By:  Tupaki Desk   |   18 Aug 2016 10:30 PM GMT
వీరభద్రంకు ఛాన్సులిస్తోందెవరు?
X
అహనా పెళ్లంట.. పూలరంగడు లాంటి హిట్టు సినిమాలతో దర్శకుడిగా కెరీర్ ఆరంభించాడు వీరభద్రం చౌదరి. మూడో సినిమాకే ఏకంగా నాగార్జున లాంటి స్టార్ హీరోతో పనిచేసే అవకాశం లభించింది. కానీ దాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ‘భాయ్’ సినిమాతో నాగార్జునకు.. ఆయన బేనర్ కు చాలా బ్యాడ్ నేమ్ తెచ్చిపెట్టిన అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. ఈ దెబ్బకు దాదాపు మూడేళ్ల గ్యాప్ వచ్చేసింది.

ఇప్పుడు ఆది హీరోగా ‘చుట్టాలబ్బాయి’తో వస్తున్న వీరభద్రమ్.. ఈ సినిమాతో మళ్లీ తనేంటో రుజువు చేసుకుంటానంటున్నాడు. ఈ సినిమా తర్వాత తాను రెండు భారీ ప్రాజెక్టులు చేయబోతున్నట్లు వెల్లడించాడు వీరభద్రం. అందులో ఒకటి స్టార్ హీరోతో ఉంటుందట. ఇంకోటి పెద్ద బేనర్లోనట. వాళ్లెవ్వరన్నది మాత్రం చెప్పలేదు వీరభద్రమ్. స్ట్రగుల్లో ఉన్న ప్రతి దర్శకుడూ తన కొత్త సినిమా విడుదలకు ముందు ఇలాగే చెబుతుంటాడు. మరి ‘చుట్టాలబ్బాయి’ విడుదలయ్యాకైనా వీరభద్రమ్ కు ఛాన్సులిస్తోందెవరో తెలుస్తుందేమో చూద్దాం.

ఇక భాయ్ సినిమా విషయంలో అప్పట్లో నాగార్జున రిగ్రెట్ కావడంపై వీరభద్రమ్ చెబుతూ.. ‘‘ఆ వ్యాఖ్యల గురించి నేను మాట్లాడను. కొన్నిసార్లు అంచనాలు తప్పుతుంటాయి. జయాపజయాలు సహజం. నా ప్రయత్న లోపం వల్లే ఆ సినిమాకు అలాంటి ఫలితం వచ్చింది. నా సినిమాల్లో కామెడీ ఆశించి వచ్చిన ప్రేక్షకులు నిరాశ చెందారు. ఇకపై అలా జరగదు. ‘చుట్టాలబ్బాయి’లో కావాల్సినంత కామెడీ ఉంటుంది’’ అన్నాడు.