Begin typing your search above and press return to search.

వీరభద్రం@తిరువనంతపురం

By:  Tupaki Desk   |   7 Oct 2015 4:00 AM IST
వీరభద్రం@తిరువనంతపురం
X
తెలుగు సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లని - దైవాన్ని నమ్మే వారికి లెక్కే లేదు. అంతకుముందు దైవాన్ని నమ్మనివారైనా టాలీవుడ్ లో అడుగుపెడితే ముహూర్తం రోజు కొబ్బరికాయ కొట్టాల్సిందే. మొన్నటికి మొన్న రామ్ గోపాల్ వర్మే విఘ్నాల నుండి గట్టెక్కించమని వినాయకుడితో మొర పెట్టుకున్నాడు. ఈయన సంగతి ఎలా వున్నా మరో టాలీవుడ్ దర్శకుడు సంచలనం సృష్టించిన పద్మనాభ స్వామిగుడిలో కనపడి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన అహ నా పెళ్ళంట సినిమా దర్శకుడు వీరభద్రం గుర్తున్నాడుగా. కామెడీ దర్శకులు కరువైపోతున్న రోజుల్లో అహ నా పెళ్ళంట - పూలరంగడు సినిమాలు చేసి ఆ స్థానాన్ని భర్తీ చేసే వాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున హీరోగా చేసిన భాయ్ సినిమాతో మొత్తం గ్రాఫ్ మారిపోయింది. తాజాగా ఆదిని చుట్టాలబ్బాయిగా చూపించే పనిలో ఉన్న ఇతగాడు అపూర్వ సంపదకు నిలయంగా చెప్పుకుంటున్న అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నాడు. పద్మనాభుడు వీరభద్రానికి తన గుప్త నిధులను ఇవ్వకపోయినా వచ్చే సినిమాకి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కురిపిస్తాడేమో చూడాలి.