Begin typing your search above and press return to search.
వీరయ్య 150 కోట్ల లెక్క.. బాస్ పవర్ఫుల్ రికార్డ్
By: Tupaki Desk | 20 Jan 2023 3:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ వాల్తేర్ వీరయ్య. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకొని సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఐదో సినిమా ఇదే అని చెప్పాలి. మొదటి నాలుగు సినిమాలు మెగాస్టార్ నుంచి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి. ఫ్యాన్స్ మెగాస్టార్ నుంచి ఏ అంశాలు కోరుకొని సినిమాలకి వెళ్తారో అలాంటి అంశాలు మెగాస్టార్ గత సినిమాలలో లేవని చెప్పాలి.
అయితే వాల్తేర్ వీరయ్య సినిమాలో అలాంటి అంశాలు అన్ని పుష్కలంగా ఉన్నాయి. ఫస్ట్ నుంచి చివరి వరకు ఫుల్ కామెడీతో కథని దర్శకుడు బాబీ నడిపించాడు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. వీటన్నింటికి మించి మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ లో ఒకప్పటి ఎనర్జీ, కామెడీ టైమింగ్ పెర్ఫార్మెన్స్ కనిపించడంతో ప్రేక్షకులు భాగా కనెక్ట్ అయిపోయారు.
ఈ నేపధ్యంలో సినిమా సంక్రాంతి తర్వాత కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. కేవలం మొదటి నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయిన వాల్తేర్ వీరయ్య ఇప్పుడు 150 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసింది. టాలీవుడ్ లో 150 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసిన సినిమాల జాబితాలో ఇప్పుడు వాల్తేర్ వీరయ్య చేరిందని చెప్పాలి.
అలాగే టాలీవుడ్ లో స్టార్ హీరోలలో 150 కోట్ల క్లబ్ లో చేరిన హీరోల జాబితా చూసుకుంటే మహేష్ బాబు 5 సార్లు, ప్రభాస్ 4 సార్లు, చిరంజీవి 3 సార్లు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ లో చేరారు. వీరి తర్వాత అల్లు అర్జున్ 2, రామ్ చరణ్ 2, తారక్ 2, పవన్ కళ్యాణ్ 1 సారి 150 గ్రాస్ క్లబ్ లో తమ సినిమాలతో చేరారు. ఏది ఏమైనా కలెక్షన్స్ పరంగా సరైన కథ పడితే మెగాస్టార్ ని బీట్ చేసేవారు ఎవరూ ఉండరని వాల్తేర్ వీరయ్యతో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.