Begin typing your search above and press return to search.

వీరయ్య.. వీర సింహా రెడ్డి.. మైత్రి వారి ధైర్యం ఏంటో..?

By:  Tupaki Desk   |   6 Jan 2023 4:38 AM GMT
వీరయ్య.. వీర సింహా రెడ్డి.. మైత్రి వారి ధైర్యం ఏంటో..?
X
ఈ కాలంలో ఒక స్టార్ తో సినిమా అంటేనే కోట్లకు కోట్లు బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది వరుస స్టార్ హీరోల సినిమాలతో అదరగొట్టేస్తుంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ. శ్రీమంతుడు సినిమాతో మొదలైన ఈ ప్రొడక్షన్ ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. అయితే ఏ నిర్మాణ సంస్థ కూడా చేయని ఓ సాహసం వీరు చేశారు. ఒకేసారి ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు నిర్మించడమే కాకుండా ఆ రెండు సినిమాలను ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్న మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి నట సింహం బాలకృష్ణ వీర సింహా రెడ్డి రెండు సినిమాలు మైత్రి మేకర్స్ నిర్మించినవే. రెండు కూడా భారీ బడ్జెట్ సినిమాలే అయితే ఈ సినిమాలు రెండు ఒకరోజు తేడాతో పొంగల్ రేసులో పోటీ పడుతున్నారు. బాలయ్య వీర సింహా రెడ్డి జనవరి 12న వస్తుంటే.. చిరు వీరయ్య సినిమా 13న రిలీజ్ చేస్తున్నారు. మైత్రి వారి ధైర్యం ఏంటో కానీ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ చేసి వారి గట్స్ ప్రూవ్ చేసుకుంటున్నారు.

చిరు, బాలయ్య ఇద్దరు పెద్ద హీరోలే. ఇద్దరి సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. సినిమాలో కొద్దిగా మ్యాటర్ ఉంటే అదరగొట్టేయడం పక్కా కానీ ఒక సినిమాకు మరో సినిమా పోటీ అనుకునే ఈ టైం లో ఒకే ప్రొడక్షన్ నుంచి వస్తున్న ఈ రెండు సినిమాలు ఒకరోజు తేడాతో రిలీజ్ అవడమే అందరికి షాక్ ఇస్తుంది.

రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఉంటే వేరు. ఒక సినిమా హిట్టై.. మరో సినిమా ఫ్లాప్ అయితే.. ఆ హిట్ సినిమా ఎఫెక్ట్ ఫ్లాప్ సినిమాపై భారీగా ఉంటుంది. ఒకవేళ టైం బాగాలేక రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో లేకపోతే ఇలా ఒకేసారి రిలీజ్ చేయడం వల్ల మరింత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

మరి ఈ కాలిక్యులేషన్ అన్ని మైత్రి వారు వేసుకునే ఉంటారు. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే రెండు సినిమాలను ఆ హీరోలను అమితంగా ప్రేమించే దర్శకులు చేశారు. కాబట్టి సినిమాలు హిట్టు కొట్టడంలో డౌట్ లేదని అంటున్నారు మైత్రి టీం. అందుకే సినిమాలు రెండిటికీ భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. సంక్రాంతికి విన్నర్ ఈ ఇద్దరిలో ఎవరైనా సరే గెలిచేది మాత్రం మైత్రి మూవీ మేకర్స్ అనే చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.