Begin typing your search above and press return to search.

ప్రజలు గజదొంగలు.. చరణ్ వేస్ట్ అనుకున్నా..

By:  Tupaki Desk   |   19 Jan 2019 5:31 AM GMT
ప్రజలు గజదొంగలు.. చరణ్ వేస్ట్ అనుకున్నా..
X
వీరమాచినేని.. వీఆర్కే డైట్ పేరుతో షుగర్ - బీపీ - సహా సర్వరోగాలు తను చెప్పిన ఎక్సర్ సైజులు పాటిస్తే పోతాయని కొత్త వైద్యవిధానాన్ని తీసుకొచ్చారు వీరమాచినేని రామకృష్ణ. విజయవాడకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గా జీవితం మొదలుపెట్టి సామాజిక సేవా కార్యకర్తగా మారారు. ఆయన చెప్పిన డైట్ ప్రకారం కొందరు సక్సెస్ అయ్యారు.. మరికొన్ని విమర్శలు వచ్చాయి. ఆయన చెప్పినట్లు ఆహారంలో మార్పులు చేసుకున్న వారికి మధుమేహం.. బీపీ - ఉబకాయం వంటి వ్యాధులు ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా.. తగ్గాయని ప్రచారం జరిగింది. షుగర్ ను కూడా తగ్గించారని వార్తలొచ్చాయి.

ఈ నేపథ్యంలోనే ఆయన ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. ఏపీ రాజకీయాల్లో కులగజ్జి - సినిమాల్లో ఫేమ్ గురించి.. అభిమానం గురించి సవివరంగా వివరించారు.

చిరంజీవి ఎంత గొప్ప యాక్టర్ అయినా ఆయన నటన ప్రధానంగా తీసిన ఆరాధన - ఆపద్భాంధవుడు - రుద్రవీణ లాంటి సినిమాలను ప్రజలు ఆదరించలేదని వీరమాచినేని సంచలన కామెంట్లు చేశారు. ఆయనంటే అభిమానమని.. నటుడిని నటుడిగా చూడాలి కానీ అందులో ఎమోషన్ ను కాదని వివరించారు. అసలు రాంచరన్ ను చూస్తే చిరంజీవి వారసుడే కాదన్నట్టు తనకు అనిపించిందని.. నటించడం రాదనుకున్నానని.. కానీ రంగస్థలం చూశాక గొప్ప నటుడు చరణ్ లో ఉన్నాడన్న విషయం తెలిసిందని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే ఆ సినిమాను నాలుగుసార్లు చూశానని వివరించారు.

తనకు సూపర్ స్టార్ కృష్ణ అంటే విపరీతమైన అభిమానమని.. కానీ తాను చిరంజీవి - ఎన్టీఆర్ సినిమాలను కూడా ఎగబడి చూసేవాడనని వీరమాచినేని చెప్పుకొచ్చారు. కృష్ణ ఫ్యాన్ వు అయ్యిండి వేరే హీరో సినిమాకు వెళతావా అని సంఘాల నేతలు నిలదీసినా.. టాలెంట్ ను చూస్తానే కానీ అభిమానాన్ని కాదని వారికి కౌంటర్ ఇచ్చానని వివరించారు. అభిమానం ఉండాలని.. దురాభిమానం ఉండొద్దని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో కులపిచ్చి ఎక్కువ అని దానికి ఒక ఉదాహరణ చెప్పారు.. దాన్ని చూస్తే లోక్ సత్తా తరుఫున నిలబడి గ్రామాల్లో ఎంతో సేవ చేసిన తన మిత్రుడు.. గొప్ప వ్యక్తిని తూర్పు గోదావరి జిల్లాలో పోటీ చేస్తే కులాభిమానంతో ఓడించారని అన్నారు. ఆయన ఓడిపోయాకే తెలిసింది ప్రజలు గజదొంగలని.. దొంగలకంటే హీనమని.. తప్పుడు వ్యక్తులను ప్రజలు ఎంకరేజ్ చేయబట్టే రాజకీయ నాయకులు ఇలా తయారయ్యారని తేల్చిచెప్పారు.

తనకు ఏపీలో బాబు - జగన్ - పవన్ అందరూ సన్నిహితులేనని తను ఎవ్వరికీ మద్దతు ఇవ్వను.. తీసుకోనని రాజకీయాల గురించి తన అభిప్రాయాన్ని చెప్పకుండా తప్పించుకున్నారు వీరమాచినేని.. తను రాజకీయాల గురించి.. నేతల గురించి మాట్లాడను అంటూ నో కామెంట్ అని చెప్పుకొచ్చారు.