Begin typing your search above and press return to search.

వీర‌ప్ప‌న్ కూతురు సినిమా క‌థ ఇదే.. ప్ర‌క‌టించిన యూనిట్‌!

By:  Tupaki Desk   |   10 April 2021 9:44 AM GMT
వీర‌ప్ప‌న్ కూతురు సినిమా క‌థ ఇదే.. ప్ర‌క‌టించిన యూనిట్‌!
X
గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ గా పేరుగాంచిన వీర‌ప్ప‌న్ కూతురు విజ‌య‌ల‌క్ష్మి సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఆమె క‌థానాయ‌కిగా కేఎన్ఆర్ రాజా తెర‌కెక్కిస్తున్న చిత్రం 'మా వీరన్ పిళ్లై'. కేఎన్ఆర్ మూవీస్ బ్యాన‌ర్ పై రాజా స్వ‌యంగా నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా మొద‌లైన నాటి నుంచి.. వీర‌ప్ప‌న్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతోంద‌నే ప్ర‌చారం సాగింది.

ఇప్ప‌టికే నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ లో ఉంది. త్వ‌ర‌లోనే విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా సినిమా విశేషాల‌ను వెల్ల‌డించారు ద‌ర్శ‌కుడు రాజా. అంద‌రూ అ‌నుకుంటున్న‌ట్టుగా.. వీర‌ప్ప‌న్ కు, త‌మ సినిమాకు ఎలాంటి సంబంధమూ లేద‌ని ప్ర‌క‌టించారు.

స‌మాజంలోని స‌మ‌స్య‌ల‌నే ఇతివృత్తంగా తీసుకొని సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు తెలిపారు. ఒకే అంశం కాకుండా ఇందులో చాలా స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించిన‌ట్టు చెప్పారు. ఢిల్లీలో సాగుతున్న రైతుల పోరాటంతోపాటు, మోస‌పోతున్న యువ‌తుల క‌ష్టాల‌ను కూడా చూపించ‌బోతున్న‌ట్టు చెప్పారు. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి, త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని తెలిపారు. ఈ చిత్రానికి ర‌వివ‌ర్మ సంగీతం స‌మ‌కూర్చారు.