Begin typing your search above and press return to search.

రజనీకాంత్ ను వీరప్పన్ కిడ్నాప్ చేయాలనుకున్నాడట

By:  Tupaki Desk   |   17 May 2016 7:19 AM GMT
రజనీకాంత్ ను వీరప్పన్ కిడ్నాప్ చేయాలనుకున్నాడట
X
వివాదాస్పద వ్యాఖ్యల్ని చేయటమే కాదు.. సంచలన విషయాల్ని బయటకు చెప్పటం ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు మామూలే. తాజాగా ఆయనో ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు. గంధం చెక్కల స్మగ్లర్.. తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల్ని వణికించిన వీరప్పన్ మీద సినిమాను తీసిన ఆయన.. ఈ సినిమా కోసం ఆయన చాలానే రీసెర్చ్ చేశాడట. ఈ సందర్భంగా వీరప్పన్ కు సన్నిహితంగా ఉన్న వారెందరినో కలిసిన వర్మ.. వారి నుంచి ఆసక్తికర అంశాల్ని తెలుసుకున్నాడట.

ఆ అంశాల్ని తాజాగా వర్మ బయటపెట్టారు. తనను తాను గొప్పగా భావించే వీరప్పన్.. ఒక దశలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కూడా కిడ్నాప్ చేయాలని భావించాడట. అంతేకాదు.. రజనీకాంత్ కంటే తాను గొప్పవాడిగా ఫీల్ అయ్యేవాడన్న విషయాన్ని వర్మ వెల్లడించారు.

ఒక కిడ్నాప్ ఉదంతంలో తనకు డబ్బులు ఇవ్వటానికి బదులుగా.. తన మీదనే ఒక సినిమా తీయాలని డిమాండ్ చేసి విషయాన్ని వెల్లడించిన వర్మ మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాజాగా వీర్పన్ మీద కొత్త సినిమాను బాలీవుడ్ హీరో సచిన్ జోషి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన సన్నివేశాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ కొత్త చిత్రంలో ఇంకెన్ని సంచలన అంశాలు ఉంటాయో..?