Begin typing your search above and press return to search.

అఖండ రికార్డు.. వారంలోనే బద్దలు కొట్టిన వీరసింహారెడ్డి

By:  Tupaki Desk   |   20 Jan 2023 11:00 AM GMT
అఖండ రికార్డు.. వారంలోనే బద్దలు కొట్టిన వీరసింహారెడ్డి
X
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా ఆయన కెరియర్లోనే అత్యధిక కలెక్షన్లు రాబడుతున్న సినిమాగా నిలుస్తోంది. విడుదలై వారం రోజుల పైనే అవుతున్న ఈ సినిమా కోసం థియేటర్లకు ప్రేక్షకులకు క్యూ కడుతున్నారు. ఒకరకంగా చూసుకుంటే నందమూరి బాలకృష్ణ వరుస బ్లాక్ బాస్టర్స్ అందిస్తూ వస్తున్నారు. తన కెరీర్లోనే అఖండ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకున్న ఆయన... ఆ తర్వాత ఆ సినిమాను దాటేసి ఇప్పుడు తన కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

గోపీచంద్ మల్లిని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమా కేవలం 8 రోజుల్లో అఖండ సినిమా టోటల్ కలెక్షన్స్ అన్నింటిని దాటేసింది. జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అమెరికాలో అయితే మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టగా తెలుగు రాష్ట్రాలలో వారం రోజుల వ్యవధిలోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

అలా ఈ సినిమా నందమూరి బాలకృష్ణ కెరియర్ లోనే అత్యధిక భారీ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచిన అఖండ సినిమా కలెక్షన్లు దాటేసి కేవలం ఎనిమిది రోజుల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్ సంస్థ తెరకెక్కించిన ఈ సినిమాలో అటు యాక్షన్ డాన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ తో కూడా ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నారు. ఇక మరో వారం రోజులపాటు సినిమాలేవి లేకపోవడంతో ఈ సినిమాకి ఎదురులేదని అంటున్నారు విశ్లేషకులు.

నందమూరి బాలకృష్ణ హీరోగా డ్యూయల్ రోల్లో నటించిన ఈ సినిమాలో హనీ రోజ్, శృతిహాసన్లు హీరోయిన్లుగా నటించారు. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్ పాత్రలో నటించగా ఆయన భార్య పాత్రలో తమిళ స్టార్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. మొత్తం మీద బాలకృష్ణ సినిమా తన కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.