Begin typing your search above and press return to search.
`వీరసింహారెడ్డి` ప్రీ రిలీజ్ వేదిక దారి మళ్లింపు
By: Tupaki Desk | 5 Jan 2023 5:00 PM GMTNBK `వీరసింహారెడ్డి` ప్రీ రిలీజ్ వేడుక వేదిక మారిన సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ మూవీమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న ఒంగోలులో జరగనుందని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఒంగోలు పట్టణంలోని ఏడీఎం కళాశాల మైదానంలో ఈ వేడుక జరగాల్సి ఉండగ భద్రతా కారణాల దృష్ట్యా ఏడీఎం కాలేజీ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు నిరాకరించింది. తాజా సమాచారం మేరకు.. ప్రీఈవెంట్ వేదికను ఒంగోలులోని మార్కెట్ యార్డ్ ఎదుట ఉన్న అర్జున్ ఇన్ ఫ్రా గ్రౌండ్ కు మార్చామని మేకర్స్ ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
అయితే వెన్యూకి వెళ్లేందుకు మూడు విభిన్న మార్గాలను అనుసరించాలని ట్రాఫిక్ కండీషన్స్ అండ్ రూల్స్ ని విడుదల చేశారు.
గుంటూరు విజయవాడ చీరాల వైపు నుంచి ప్రీరిలీజ్ వేడుకకు వచ్చే వాహనాలు త్రోవగుంట ఫ్లైఓవర్ ఎక్కకుండా బైలైన్ సర్వీస్ రోడ్ లో కిమ్స్ మీదుగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయం పార్కింగ్ ఏరియా నుంచి ఎంటర్ అయ్యి ఈవెంట్ వద్దకు చేరుకోగలరు.
అలాగే నెల్లూరు కావలి వైపు నుంచి ప్రీరిలీజ్ వేడుకకు వచ్చే వాహనాలు ఒంగోలు టౌన్ లో ప్రవేశించకుండా పెళ్లూరు ఫ్లైఓవర్ ఎక్కి కిమ్స్ ఫ్లైవోవర్ నుంచి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయం పార్కింగ్ ఏరియా నుంచి ఎంటర్ అయ్యి ఈవెంట్ వద్దకు చేరుకోగలరు.
కడప కర్నూలు చీమకుర్తి నుంచి వేడుకకు వచ్చే వాహనాలు కర్నూలు బైపాస్ సెంటర్ మీదుగా సర్వీస్ రోడ్ ద్వారా మంగమ్మ కాలేజీ పార్కింగ్ ఏరియా నుంచి ఈవెంట్ కి చేరుకోగలరు. ఒంగోలు టౌన్ నుంచి గుంటూరు చీరాల వెళ్లే వాహనాలు.. ఒంగోలు నుంచి కావలి-నెల్లూరు వైపు వెళ్లే వాహనాలు... ఒంగోలు నుంచి చీరాల వెళ్లే వాహనాలు రూట్ మార్చుకుని వెళ్లాల్సి ఉంటుందని ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఒంగోలు టౌన్ నుంచి గుంటూరు విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలు కొత్త పట్నం బస్టాండ్ నుంచి కొప్పోలు మీదుగా ఎన్ హెచ్ 16 కి వెళ్లాలి. ఒంగోలు పట్టణం నుంచి నెల్లూరు వైపు వెళ్లే వాహనాలు ఒంగోలు సౌత్ బైపాస్ మీదుగా రమేష్ సంఘమిత్ర ఆస్పత్రి మీదుగా ఎన్ హెచ్ 16కి చేరుకోవాలి. ఒంగోలు టౌన్ నుంచి చీరాల వైపునకు వెళ్లే వాహనాలు కొత్త పట్నం బస్టాండ్ మీదుగా ఎన్ హెచ్ 16కి చేరుకుని త్రోవగుంట అండర్ పాన్ నుంచి చీరాల రోడ్ వైపు వెళ్లాలి.
మారిన నియమావళిని అనుసరించి వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ వేడుకకు అభిమానులు ప్రజలు హాజరు కావాల్సి ఉంటుంది. 6 జనవరి 6 పీఎం నుంచి వేడుక వైభవంగా సాగనుంది. ఈ వేడుకలోనే థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ తో అభిమానులు డబుల్ బొనాంజా ట్రీట్ ని ఆస్వాధించనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 8:17 PM థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ పాత్రలో నటించారు. శృతి హాసన్ కథానాయికగా నటించగా.. హనీ రోజ్- వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.
ఈ సినిమాల బాలకృష్ణ పాత్రను పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారని నటసింహం రోరింగ్ అంటూ అభిమానులు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారు. ఈ మూవీలో నెవ్వర్ బిఫోర్ అనిపించేలా హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన పోస్టర్ లలో బాలయ్య చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు. లుంగీ కట్టు నల్ల చొక్కాలో ఉగ్రతాండవం ఫ్యాన్స్ ని ఉరకలెత్తిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.