Begin typing your search above and press return to search.
సెట్లో వీరసింహారెడ్డి స్వైర విహారం!
By: Tupaki Desk | 28 Oct 2022 11:30 AM GMTనటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా 107వ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమాకి వీరసింహారెడ్డి టైటిల్ ప్రకటించడంతో ఒక్కసారిగా అంచనాలకు అంకంతకు రెట్టింపు అవ్వడం మొదలైంది. మరోసారి రెడ్డి టైటిల్ తెరపైకి తీసుకురావడంతో సీమ ఫ్యాక్షనిజం కంటెంట్ కి ఏమాత్రం తగ్గకుండాటుందని అభిమానుల్లో అంచనాలు మొదలైయ్యాయి.
ఈ తరహా సినిమాలు చేసి చాలా కాలమవుతోంది. ఈనేపథ్యంలో టైటిల్ తోనే నటసింహం యాంగర్ రేంజ్ని చూపించారు. ఇక రంగంలోకి దిగితే వార్ వన్ సైడ్ అవుతుందని థియేటర్లో చూపిస్తారు. అందుకోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేయాలని టీమ్ శ్రమిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది.
ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్ లో మరో కీలక షెడ్యూల్ ని మొదలు పెట్టారు. ఇందులో భాగంగా బాలకృష్ణ.. విలన్ గ్యాంగ్ మధ్య భారీ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. ఇందులో బాలయ్య ని ఢీకొట్టడానికి ఏకంగా దునియా విజయ్ ని రంగంలోకి దించారు. అయితే నిన్నటి షెడ్యూల్ లో ఆయన కనిపించనట్లు సమాచారం.
ఆయనపై..బాలయ్యపై ఫేస్ టూ ఫషేస్ సన్నివేశాలు కొన్ని ఉన్నాయట. వాటిని అతి త్వరలోనే చిత్రీకరించనున్నారని తెలిసింది. బాలయ్యకిధీటుగానే విజయ్ పాత్ర సైతం పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. విలన్ పాత్రని ఓ కొత్త కోణంలో చూపించనున్నారని సమాచారం. యాక్షన్ సన్నివేశాల్లో బాలయ్య దూకుడు ఏమాత్రం తగ్గలేదని టాక్.
60 ప్లస్ లోనూ నటసింహం గర్జన తగ్గలేదంటున్నారు. 30 ఏళ్ల హీరోలా బాలయ్య సింహలా ప్రత్యర్ధులపై ఎటాకింగ్ దిగుతున్నాడని చూసిన వాళ్లు చెబుతున్నారు. ఈయాక్షన్ సన్నివేశాలు ఫైట్ మాస్టర్ వెంటక్ అధ్యర్యంలో చిత్రీకరిస్తున్నారు. ఏదైనా బాలయ్య తర్వాతే అని మరోసారి అర్దమైంది. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. బాలయ్య తో సినిమా నిర్మించాలని ఇండస్ర్టీకి వచ్చిన నాటి నుంచి మైత్రీ ప్లాన్ చేస్తోంది. ఆ ఛాన్స్ ఇప్పుడు దొరికింది. మరి మైత్రీ బ్యానర్ బాలయ్యకి ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.