Begin typing your search above and press return to search.
వీరయ్య Vs వీరసింహా.. అసలేం జరుగుతోంది..?
By: Tupaki Desk | 27 Oct 2022 9:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "వాల్తేరు వీరయ్య" మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ "వీరసింహా రెడ్డి" సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. రెండూ 2023 సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రాబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు.
బాలయ్య - చిరు వంటి ఇద్దరు సీనియర్ హీరోలు చాలా గ్యాప్ తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందాయి.
సాధారణంగా ఒకే సంస్థ నిర్మించిన రెండు భారీ సినిమాలు ఒకే సీజన్ లో రిలీజ్ కావడం జరగదు. కానీ టాలీవుడ్ లో ఈసారి సంక్రాంతికి అలాంటి అరుదైన బాక్సాఫీస్ వార్ ని చూడబోతున్నాం. కాకపోతే దీని వల్ల ఈ సినిమాలతో సంబంధం ఉన్న ఇరు వర్గాలు నష్టపోయే అవకాశం ఉంది.
నిజానికి బాలకృష్ణ 107వ చిత్రాన్ని డిసెంబర్ లో.. చిరంజీవి 154వ సినిమాని సంక్రాంతి కి రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ బాలయ్య కూడా పెద్ద పండక్కే రావాలని డిసైడ్ అవ్వడంతో పరిస్థితులన్నీ మారిపోయాయి.
రెండు సినిమాలను ఒకే సీజన్ లో రిలీజ్ చేయడం వల్ల థియేటర్ల సమస్య రావడమే కాదు.. ఓపెనింగ్స్ మీద గట్టి దెబ్బ పడుతుంది. మొదటి రోజు ఏ సినిమాకు భారీ కలెక్షన్లను ఆశించలేం. ఇది అధిక రేట్లు చెల్లించి సినిమాలు కొనుగోలు చేసిన బయ్యర్లకు ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు.
అందులోనూ 'వాల్తేరు వీరయ్య' మరియు 'వీరసింహా రెడ్డి' రెండూ ఒకే వర్గం ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య క్లాష్ ఏర్పడితే బయ్యర్లు, ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తగ్గిపోతాయి.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. సంక్రాంతికి ఈ రెండు చిత్రాలతో పాటుగా 'ఆది పురుష్' 'ఏజెంట్' మరియు 'వారసుడు' వంటి మరో మూడు క్రేజీ చిత్రాలు థియేటర్లలోకి రావాలని చూస్తున్నాయి. అందుకే చిరంజీవి - బాలయ్య సినిమాలను ఒకే రోజు విడుదల చేయొద్దని బయ్యర్లు నిర్మాతలను కోరుతున్నారట.
'వాల్తేరు వీరయ్య' vs 'వీరసింహా రెడ్డి' వార్ వల్ల కలిగే నష్టాలను వివరించేందుకు ఇటీవల డిస్ట్రిబ్యూటర్ల బృందం మైత్రీ ప్రొడ్యూసర్స్ ని కలిశారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో చిరంజీవి - బాలకృష్ణ లను ఒప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించిన మేకర్స్.. ఒక్క రోజు గ్యాప్ లో సినిమాలను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఇద్దరిలో ఎవరు ముందుగా వస్తారు? అనేది ఇప్పుడు సమస్యగా మారిందని టాక్ నడుస్తోంది. ఈ విషయంలోనూ నిర్మాతలు అగ్ర హీరోలతో చర్చిస్తున్నారట. త్వరలోనే రెండు సినిమాల విడుదలపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.