Begin typing your search above and press return to search.

అమ్మాయిల సినిమాను పాక్ బ్యాన్ చేసింది

By:  Tupaki Desk   |   31 May 2018 4:36 AM GMT
అమ్మాయిల సినిమాను పాక్ బ్యాన్ చేసింది
X
మన సినిమాలకు పొరుగు దేశం.. దాయాది దేశం అయిన పాకిస్తాన్ లో ఫుల్లు గిరాకీ ఉంటుందనే సంగతి తెలిసిందే. కానీ.. మన సినిమాలపై చీటికీ మాటికీ నిషేధం అంటూ కూడా అడ్డుపుల్లలు వేయడం.. అక్కడి సెన్సార్ బోర్డుకు అలవాటే. ఈ సారి రంజాన్ కి వస్తున్న సల్మాన్ ఖాన్ మూవీ రేస్3ని ఇప్పటికే బ్యాన్ చేసింది పాక్.

రేస్3 రిలీజ్ ని ఆపేయడానికి కారణం.. అక్కడి సినిమాలకు కాంపిటీషన్ అవుతుందనే. అయితే.. ఇప్పుడు జూన్ 1న విడుదల కావాల్సిన సోనమ్ కపూర్- కరీనా కపూర్ మూవీ వీరే ది వెడ్డింగ్ కు కూడా అక్కడ బ్రేక్ పడింది. బ్రేక్ మాత్రమే కాదు.. ఏకంగా బ్యాన్ విధించేశారు. ఇందుకు కారణం.. సినిమాలో ఉన్న వల్గర్ డైలాగ్స్.. అడల్ట్ కంటెంట్ అంటూ రీజన్ చెప్పారు పాక్ సెన్సార్ బోర్డ్ ఛైర్మన్ దన్యల్ గిలానీ. సీబీఎఫ్సీ మెంబర్లు అందరూ వీరే ది వెడ్డింగ్ మూవీని.. సెన్సార్ షిప్ ఫిలిం కోడ్ 1980ప్రకారం.. నిషేధించాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు చెప్పడం విశేశం.

ఈ సినిమాలో అనేకమైన వల్గర్ డైలాగ్స్ ఉన్నాయని.. అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పాక్ బోర్డు అంటోంది. ఇప్పటికే ఈ చిత్రంపై వస్తున్న అనేక విమర్శల కారణంగా.. స్థానిక డిస్ట్రిబ్యూటర్లు కూడా రియాక్ట్ అయ్యారు. సర్టిఫికేట్ అప్లై చేసుకున్న దరఖాస్తును కూడా ఉపసంహరించుకున్నారు. ఏతావాతా చూస్తే.. వీరే ది వెడ్డింగ్ పాక్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని తేలిపోయింది.