Begin typing your search above and press return to search.
దిల్ రాజు కొత్త సినిమా పోస్టరొచ్చింది
By: Tupaki Desk | 2 Nov 2016 5:30 PM GMTతన ప్రొడక్షన్లో కొత్త దర్శకుల్ని పరిచయం చేస్తూ విభిన్నమైన సినిమాలు తీయడమే కాదు.. సినిమా పూర్తయ్యాక ప్రివ్యూ చూసి నచ్చిన సినిమాల్ని కూడా తన బేనర్ ద్వారా రిలీజ్ చేస్తూ బ్యాకప్ ఇస్తుంటాడు దిల్ రాజు. అలా ఆయన రిలీజ్ చేస్తున్న కొత్త సినిమా ‘వెళ్లిపోమాకే’. యాకూబ్ అలీ అనే యువ దర్శకుడు ‘ఇలా నీ జతగా’ పేరుతో ఓ సినిమా రూపొందించి.. దాన్ని సొంతంగా రిలీజ్ చేయలేని పరిస్థితుల్లో దిల్ రాజుకు ప్రివ్యూ వేయగా.. ఆయనకు ఆ సినిమా నచ్చేసి ‘వెళ్లిపోమాకే’ అని పేరు మార్చి.. తన బేనర్ ద్వారా రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజే లాంచ్ చేశాడు దిల్ రాజు.
ఐతే ‘వెళ్లిపోమాకే’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఏమంత ప్రత్యేకంగా లేదు. ‘7/జి బృందావన కాలనీ’ని గుర్తుకు తెచ్చేలా హీరోయిన్ హీరోకు నుదుటిపై ముద్దిస్తున్నట్లుగా ఉన్న ఒక పోస్టర్.. దానికి కూడా ఎఫెక్టులు జోడించడం వల్ల హీరో హీరోయిన్ల ముఖాలు కనిపించట్లేదు. దర్శకుడే కాదు.. ఈ హీరో హీరోయిన్లద్దరూ కొత్త వాళ్లే. ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు తమ బేనర్ నుంచే రిలీజ్ చేస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తన ట్విట్టర్ హ్యాండిల్లో ప్రకటించింది. ఈ చిత్ర దర్శకుడు యాకుబ్ అలీ రామానాయుడు ఫిలిం స్కూల్లో శిక్షణ పొందగా.. హీరో విశ్వక్సేన్ ముంబయిలో అనుపమ్ ఖేర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ స్కూల్లో కోర్సు చేయడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/